భారతదేశపు న్యాయవ్యవస్థ మొత్తం ఏకమైంది. వైఎస్ జగన్ అత్యంత దారుణమైన తప్పు చేశారని, తనకు బెయిలు ఇచ్చిన షరతులను ఉల్లంఘించడమే కాకుండా ఒక న్యాయమూర్తి ప్రతిష్టను దారుణంగా దురుద్దేశపూరితంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘాటుగా స్పందించింది. జగన్ రెడ్డిని దుష్టశక్తితో పోలుస్తూ… న్యాయవ్యవస్థపై దుష్టశక్తుల దాడిని తిప్పికొట్టాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.
న్యాయవ్యవస్థలపై గతంలో అనేక మంది దాడులు చేశారని, నేడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలోంచి దాడి జరుగుతోంది, దీనిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంది. కేవలం తన తప్పులను ప్రజలు మన్నించడానికి న్యాయవ్యవస్థ విలువలనే దిగజార్చే ప్రయత్నం ఇది అని బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
‘‘జగన్ లేఖ వెనుక దురుద్దేశం ఉంది. జగన్పై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ కాబోయే ఎన్వీ రమణపై ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను బెదిరించేందుకే జగన్ సీబీఐకి రాసిన లేఖను బయటపెట్టారు. న్యాయ సూత్రాల క్రమశిక్షణ మేరకు ఇటువంటి లేఖలపై న్యాయమూర్తులు బహిరంగంగా స్పందించలేరు. ఇటువంటి సమయంలో న్యాయవాదులు, బార్ కౌన్సిళ్లు గళం విప్పాల్సిన అవసరం ఉంది’’ – బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
మరోవైపు ఇప్పటికే ఢిల్లీ బార్ కౌన్సిల్ జగన్ తీవ్రమైన తప్పు చేశారని వ్యాఖ్యానించగా… తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. జగన్ లేఖ న్యాయవ్యవస్థపై దాడి అని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దురుద్దేశాలతో చేసిన ప్రయత్నంగా జగన్ చర్యను వ్యాఖ్యానించింది.
మరోవైపు జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు పిటిషను వేశారు.
రాజకీయ నేతలపై కేసులు వేగంగా విచారణకు రావడానికి కారణం అయినా అశ్విని ఉపాధ్యాయ కూడా జగన్ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ రెండు రకాల నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
జస్టిస్ రమణపై బురద జల్లడం ద్వారా ప్రజల్లో సానుభూతి కొట్టేసి చంద్రబాబును డ్యామేజ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ప్రయత్నం బూమ్ రాంగ్ అయ్యి తన పదవి, తన బెయిలు రెండూ పోయేంత ముప్పుగా పరిణమించేలా కనిపిస్తోంది.