సీఎం అయ్యాక జగన్ కోర్టుకు హాజరైంది చాలా తక్కువ.
చాలామంది అమాయకులు సీఎం అయితే కోర్టు వాయిదాలకు మినహాయింపు వచ్చింది అనుకుంటున్నారు.
కానీ జగన్ తెలివితేటలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవక తప్పదు.
జగన్ చట్టంలో ఉండే లొసుగులు వాడుకుని చాలా తెలివిగా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు.
మీకు అర్థం కాలేదు కదా. ఇపుడు వివరంగా చెబుతాను.
జగన్ ఈడీ కోర్టుకు వెళ్లాల్సిన తేదీలను ఈడీ కోర్టు ఇలా ఖరారు చేసింది.
ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో జగన్ కోర్టుకు రావాలని ఈడీ కోర్టు చెప్పింది. ఇవన్నీ మంగళవారాలే.
ఇక మరో వైపు వ్యక్తిగతం జగన్ కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఈ తేదీల్లో విచారణ పెట్టింది.
ఏప్రిల్ 9, 16, 23 తేదీల్లో జగన్ కోర్టుకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
అయితే… చట్టంలో చిన్న వెసులు బాటు ఏంటంటే… ఏదైనా కీలక మైన పదవిలో ఉన్నపుడు ముఖ్యమైన బాధ్యతలు ఉంటే హాజరుకు మినహాయింపు కోరవచ్చు. ఈ లూప్ హోల్ ను జగన్ అడ్డంగా వాడేశాడు.
ఇది జగన్ తెలివి.