ఏపీలో కొత్త ప్రభుత్వం.. వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతోందని చెబుతున్నారు. అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారి ప్రచారం చేస్తున్నారు. కానీ, కొన్ని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చేసిన పనులనే ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతో ఇంతో పేర్లు మార్చడమో.. లేక.. మరేదైనా చేయడమో చేసి.. గత చంద్రబాబు పాలనలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా.. ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్-2021ని ప్రారంభించింది.
రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉ న్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడమే వాణిజ్య ఉత్సవ్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సహకారంతో ట్రేడ్ ఎక్స్పోర్ట్ కార్నివాల్ పేరిట వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 ఏళ్ల ఉత్సవం సందర్భంగా వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఏపీ ఎగుమతులు రెండేళ్లలో వృద్ధి చెందాయని.. పారిశ్రామిక కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ప్రభుత్వం పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని(ఇది బాబు హయాంలో ఉన్న రికార్డే) ప్రభుత్వం గుర్తు చేసింది. ఏపీ క్రమంగా ఎగుమతుల వృద్ధి సాధిస్తోందని ప్రభుత్వం తెలిపింది. 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి పెరిగిందని పేర్కొంది. ఆక్వా ఉత్పత్తులు, ఫార్మా రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఏపీలో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.
అంతేకాదు.. ఏపీ క్రమంగా ఎగుమతుల వృద్ధి సాధిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి పెరిగిందని, ఆక్వా ఉత్పత్తులు, ఫార్మా రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపింది. ఏపీలో 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఏపీలో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయని పేర్కొంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ వల్ల ఎగుమతులు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.
అయితే.. ఇప్పుడు నిర్వహిస్తున్న వాణిజ్య సదస్సు.. గతంలో చంద్రబాబు ఏటా జనవరిలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన `పెట్టుబడుల సదస్సు`ను గుర్తు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. అప్పట్లో పెట్టుబడులు ఆకర్షిస్తే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాణిజ్యాన్ని ఆశిస్తోందని..చెబుతున్నారు. ఏదేమైనా.. చంద్రబాబు అమలు చేసిన కార్యక్రమాన్ని జగన్ అటు ఇటు పేరు మార్చి అమలు చేస్తున్నారని.. సోషల్ మీడియాలోనూ కామెంట్లు పడుతుండడం గమనార్హం.