ఉద్యోగ, ఉపాధ్యాయులను నిలువునా ముంచిన సంఘాల నేతలు
వేతనాల్లో భారీ కోత వేసినా.. సీఎంకు ఎనలేని ప్రేమ ఉందట!
రగిలిపోతున్న టీచర్లు, ఉద్యోగులు
నవ్యాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఉద్యోగ సంఘాల నేతలే తీరని ద్రోహం చేశారు. వేతన సవరణ డిమాండ్లను సాధించి తెస్తామని నమ్మించి.. గొంతుకోశారు. మంత్రుల కమిటీ చర్చలకు పిలిచిందని వెళ్లి.. దాసోహమన్నారు. ప్రలోభాలకు లొంగారో.. బెదిరింపులకు భయపడ్డారో గాని.. నమ్ముకున్నవాళ్లను నట్టేటముంచారు. తమ కనీస డిమాండ్లను కనీసం పట్టించుకోకపోయినా.. వేతనాల్లో 20 శాతం కోతపడినా.. సర్కారు చెప్పినదానికల్లా తలూపి అప్పుడు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ చివరకు ఉగాది పండగకు కూడా శాలరీలు రాలేదు.
జగన్ ప్రభుత్వంతో పాటు తమవారే తమను వంచిస్తామని తెలియక ఉద్యోగులంతా నేతలు పన్నిన వలలో చిక్కుకున్నారు. తేనెపూసిన కత్తులని తెలియక విశ్వసించినందుకు తమ వేలితో తమ కన్నే పొడిచారని ఇప్పుడు వాపోతున్నారు. జేఏసీల నుంచి వేరుపడి మెరుగైన వేతన సవరణ కోసం ఉపాధ్యాయులంతా ఉద్యమోన్ముఖులవుతున్నారు. ఉద్యోగులు సైతం వారిని అనుసరిస్తున్నారు.
ఏం జరిగింది..?
వేతన సవరణపై చంద్రబాబు ప్రభుత్వం 2018లో నియమించిన అశుతోష్ మిశ్రా కమిషన్ తన నివేదికను జగన్ సర్కారుకు మరుసటి ఏడాదే సమర్పించింది. ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడినా ప్రభుత్వం దానిని బయటపెట్టలేదు. ఉద్యోగ సంఘాల నేతలను గుప్పిట్లో పెటుకుంది. దీంతో వారు పీఆర్సీ నివేదిక ఊసే ఎత్తలేదు.
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో.. పీఆర్సీ కమిషన్ సిఫారసులపై అధ్యయనం కోసమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో గత ఏడాది మార్చిలో ఓ కమిటీని నియమించింది. ఉద్యోగ సంఘాల నేతలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఇంకోవైపు.. ఉద్యోగుల్లో తీవ్ర అసహనం పెరిగింది. కనీసం డీఏలు కూడా విడుదల చేయకపోవడంతో కోపం కట్టలు తెచ్చుకుంది. మీరేం చేస్తున్నారంటూ సంఘాల నేతలపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. దాంతో నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరిగారు. వేతనాలపై అతిగా ఆశించవద్దని.. ఆశాభంగం తప్పదని హెచ్చరించిన ఆయన.. ప్రభుత్వ ఉద్దేశాన్ని ముందే తెలియజేశారు.
పీఆర్సీ నివేదిక ఇదిగో అదిగో అంటూ ఆయన, సీఎస్ తెగ తిప్పించుకున్నారు. దానిని పక్కనపెట్టి సీఎస్ రిపోర్టును తెరపైకి తెచ్చారు. ఉద్యోగ సంఘాలు 40-55 శాతం ఫిట్మెంట్ అడిగితే కేవలం 9 శాతమే ఇవ్వాలని సీఎస్ కమిటీ సూచించింది. అదే సంఘాల నేతలకు చెప్పారు. వారు ససేమిరా అన్నారు. చివరకు సీఎం జగన్మోహన్రెడ్డి పిలిపించారు. ఆయన సమక్షంలో చర్చలు జరిగాయి.
ఆయన బీద ఏడుపులు ఏడ్చారు. ఎక్కువ ఇవ్వాలని అనుకున్నా.. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని.. అందుచేత ఇవ్వలేకపోతున్నామని.. 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సంఘాల నేతలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తంచేశారు. హెచ్ఆర్ఏ గురించి అడిగితే చిన్న చిన్న విషయాలు అధికారులతో మాట్లాడాలని సూచించారు. తీరా వారి వద్దకు వెళ్లాకగానీ., అసలు విషయం
తెలియలేదు. హెచ్ఆర్ఏలో భారీగా కోతపెట్టారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను కలిపి వేతనం పెరిగిందన్నారు. పెన్షనర్లకు సంబంధించి అడిషినల్ క్వాంటమ్ పెన్షన్‌లోనూ కోతపెట్టింది. 70 నుంచి 75 ఏళ్లవారికి ఇవ్వాల్సిన 10 శాతం అడిషనల్ క్వాంటమ్ పెన్షనను.. 75-80 ఏళ్ల వయస్కులకు ఇవ్వాల్సిన 15 శాతం అడిషనల్ క్వాంటమ్‌ను ఎత్తివేసింది. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి పీఆర్సీ సాధిస్తారా.. లేక పదవుల నుంచి దిగిపోతారో తేల్చుకోవాలని సంఘాల నేతలకు అల్లిమేటం జారీచేశారు. దీంతో నాయకులకు సెగతగిలింది.
ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, టీచర్లు సైతం ఉద్యమాన్నే కోరుతున్నారని అర్థమై.. అయిష్టంగానే జేఏసీల నేతలంతా కలిసి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేశారు. 20 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసుకున్నారు. వీరిలో ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కీలక నాయకులు.
వీరంతా కలిసి కొన్ని కనీస డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ‘పీఆర్సీ అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవోలను ఉపసంహరించుకోవాలి. అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలి. పీఆర్సీ నివేదిక ప్రకారం కొత్త వేతన సవరణ స్కేలు ఇవ్వాలి. పీఆర్సీ అమలును నిలుపుదల చేసి చర్చలు పునఃప్రారంభించాలి. జనవరికి పాత జీతాలే చెల్లించాలని కోరారు.
ఈ డిమాండ్లను ప్రభుత్వం లెక్కచేయలేదు. కొత్త వేతన సవరణ ప్రకారమే జీతాలు వేయాలని జిల్లా ట్రెజరీ అఽధికారులను ఆదేశించింది. అయితే ట్రెజరీ ఉద్యోగులు అంగీకరించకపోవడంతో సీఎఫ్ఎంఎస్ ద్వారా రెండో తేదీన జీతాలు జమ చేసింది. రెండేళ్లుగా ఏనాడూ సకాలంలో వేతనాలు అందుకోని ఉద్యోగులకు.. వేతనాలు తగ్గించి ఖాతాల్లో వేసింది.
చలో విజయవాడతో వణుకు
ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు.. గణితంలో దశాంశమాన హెచ్చవేత ఇది. తరగతి గదిలో విద్యార్థులకు ఈ రకమైన పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు…ఆచరణలో దానిని చూపించారు. హెచ్చరికలు చేసి, బారికేడ్లు పెట్టి, నిఘా కెమెరాలతో మాటువేసి, పోలీసులతో జగన్ సర్కారు చుట్టుముట్టేసినా…అన్నింటినీ మొక్కవోని సంకల్పంతో తెంచేిశారు.
పీఆర్సీ విషయంలో చరిత్రలో ఎన్నడూ లేనంత అన్యాయం చేశారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. అంతే చరిత్రాత్మకంగా తమ ఉద్యమ శక్తిని చూపించారు. సాగర తరంగంలా ఉవ్వెతున, ఉప్పొంగిన తరంగంలా ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేణి విజయవాడను ముంచెత్తింది. వాస్తవానికి పీఆర్సీ సాఽధన కోసం ఈ నెల 3న ‘చలో విజయవాడ’కు ఊహించని రీతిలో భారీగా తరలొచ్చినా..వీరు ఒక వంతు మాత్రమే.
గ్రామాల్లో, పట్టణాల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆగిపోయినవారు…పోలీసులు ఆపేసినవారు ఇంకెందరో! పోలీ్సస్టేషన్లలో రాత్రివరకు ఉంచడంతో వారంతా భౌతికంగా విజయవాడ రాలేకపోయినా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ఇక మరోవైపు పోలీసుల కన్నుగప్పి, ప్రభుత్వ నిర్బందాన్ని ఎదుర్కొని విజయవాడకు వచ్చినవారిలో కూడా చాలామంది బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోలేకపోయారు. అయినా ఆ రోడ్డు సంపూర్ణంగా నిండిపోయింది. ప్రభుత్వం బిత్తరపోయింది.
ఎన్ని నిర్బంధాలు పెట్టినా లక్షన్నరకు పైగా విజయవాడకు తరలిరావడంతో హడలిపోయింది. 7వ తేదీ నుంచి సమ్మెకు దిగితే విజయవంతం ఖాయమని అర్థమైంది. దాంతో మళ్లీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. వారిని నయానా భయానో లొంగదీసుకుంది. ఫిట్మెంట్ 23 శాతానికి మించదని స్పష్టం చేసింది. హెచ్ఆర్ఏ శ్లాబులను కాస్త సవరించింది.
50వేల లోపు జనాభా ఉన్న చోట్ల 10ు (సీలింగ్ రూ.10 వేలు), 50వేలు-2 లక్షలలోపు జనాభా ఉన్న చోట్ల 12ు (సీలింగ్ 13 వేలు), 2లక్షలు-50 లక్షలలోపు జనాభా ఉన్న పట్టణాలు/నగరాల్లో 16ు (సీలింగ్ 17 వేలు), 50 లక్షలకు పైబడిన నగరాల్లో 24ు హెచ్ఆర్ఏ (సీలింగ్ 25 వేలు) ఇస్తామని చెప్పింది. అలాగే పెన్షనర్లకు 70-74 ఏళ్లవారికి 7 శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ , 74-79 మధ్య 12 శాతం ఇస్తామని చెప్పింది. 2019 జూలై 1 నుంచి 2020 మార్చి మధ్య ఇచ్చిన ఐఆర్ రికవరీ చేయబోమని, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు కొనసాగిస్తామని.. సీపీఎస్‌పై కమిటీ నివేదిక మార్చిలోపు ఇస్తుందని.. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అంతే.. సంఘాల నేతలు పొంగిపోయారు. తమ అసలు డిమాండ్లను మరిచిపోయారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత సీఎంను కలిసి ధన్యవాదాలతో పాటు క్షమాపణ కూడా చెప్పారు.
ప్రధాన పోరు ఎందుకు?
ఉద్యోగులు ప్రఽధానంగా పోరాడింది ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ శ్లాబులు తగ్గించడంపైనే. కానీ కానీ దొరికిన ఊరట బహుస్వల్పం. 9 నెలల ఐఆర్ మాత్రమే రికవరీ చేయబోమని.. 21 నెలల ఐఆర్ రికవరీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్ఆర్ఏ కోతల్లో పెద్దగా మార్పులేదు. పెన్షనర్లకు క్వాంటమ్ పెన్షన్ కట్ యథాతథంగా ఉంచారు. డీఏ బకాయిలు రిటైర్మెంట్ తర్వాత ఇస్తారట. జగన్ ఇంతగా మోసగించినా సంఘాల నేతలకు ఆయనలో ఎనలేని ప్రేమ కనబడింది! ఇందుకుగాను వారికి ఎంత ముట్టిందో!