ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జగన్ సీబీఐ కేసుల వ్యవహారంలో మెల్లగా కదలిక వస్తోంది.
అయితే ఇన్నాళ్లు ఆ కేసు కదలకపోవడానికి కారణం గురించి రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు.
సీబీఐ మునుపటి డైరెక్టరు తో జగన్ సన్నిహిత సంబంధాలు నెరపాడని అందుకే సీబీఐ జగన్ కోర్టుకు రాకపోయినా…. ఆ కేసును పెద్ద గా పట్టించుకోకుండా ఊరికే ఉందని, ఎపుడూ అభ్యంతరాలు చెప్పలేదని రఘురామరాజు ఆరోపించారు.
ఆయన బయటపెట్టిన గూడుపుఠాని ఈ వీడియోలో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=tp3T0jMJiu8&t=2s
అయితే, సీబీఐ కొత్త డైరెక్టరు వచ్చే సమయంలో రఘురామరాజు బెయిలు పిటిషను వేయడం సంచలనం అయ్యింది. మరి కొత్త డైరెక్టరు అనూహ్యంగా కొత్త నిబంధనల వల్ల డైరెక్టరు అయ్యారు.
రఘురామరాజు చెప్పిందే నిజమైతే… అధికారులు కొత్త డైరెక్టరు ఆదేశాల కోసం వేచి ఉండేందుకు పలుమార్లు వాయిదా అడిగారు అనుకోవాలా?
పరిస్థితులు అర్థం చేసుకుని, పెద్దలతో ప్రయత్నాలు చేసుకునేందుకే జగన్ కూడా పలుమార్లు వాయిదా అడిగాడు అనుకోవాలా?
మరి ఈ కేసులో ఏం జరగనుంది? జగన్ బెయిల్ రద్దు అవుతుందా? కంటిన్యూ అవుతుందా? అనేది చాలా ఉత్కంఠగా మారింది.
మొత్తానికి జగన్, మరియు సీబీఐ అధికారులు రెండువైపుల నుంచి కౌంటరు దాఖలుకు మరో గడువు కోరడంతో కేసు జూన్ 1కి వాయిదా పడింది.
మరి టెన్షన్ ఇంకొంతకాలం కంటిన్యూ కానుంది.
జగన్ ను జైలుకు పంపింది మహారాష్ట్ర కేడరు కు చెందిన డైరెక్టరే.
ఇపుడు కూడా మహారాష్ట్ర కేడరుకు చెందిన జైస్వాల్ సీబీఐ డైరెక్టరుగా నియమితులయ్యారు.
ఈయన అనూహ్యంగా తెరమీదకు వచ్చి పదవి దక్కించుకున్నవ్యక్తి కావడం గమనార్హం.