కొందరు ఎంఎల్ఏలకు, మంత్రులకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసుపీకినట్లు సమాచారం. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో కొందరు ఎంఎల్ఏలు, ఇద్దరు మంత్రులు పాల్గొనలేదనే విషయాన్ని జగన్ డైరెక్టుగానే ప్రస్తావించారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మంత్రులు, ఎంఎల్ఏలందరు ఓటింగులో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చారు. కాబట్టి అందరితోను జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు మంత్రులు, ఎంఎల్ఏల్లో ఎవరెవరు ఎన్నెన్నిరోజులు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాన్ని జాబితా చదివి వినిపించారట. జగన్ జాబితాను చదువుతుంటే అందరు బిత్తరపోయారట. ఎందుకంటే కార్యక్రమంలో తాము పాల్గొంటున్నది లేనిది జగన్ ప్రతిరోజు లెక్కలు తీస్తున్న విషయాన్ని నమ్మలేకపోయారట. పార్టీ తరపున సర్వే చేస్తున్న ఐప్యాక్ సంస్ధ ద్వారానే జగన్ సర్వే చేయించినట్లు సమాచారం.
ఈ సర్వే లెక్కల ప్రకారం ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ పదిరోజులు మాత్రమే పాల్గొన్నారట. మరో 20 మంది ఎంఎల్ఏలు 10 రోజులు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదట. మరో 15 మంది ఎంఎల్ఏలు 5 రోజులు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదట. మాజీ మంత్రి ఆళ్ళనాని, సీనియర్ ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే అసలు ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదని సమాచారం.
ఇలా ఎంఎల్ఏల వారీగా లెక్కలు చదివి వినిపించిన జగన్ చాలామందిపై మండిపోయారట. జనాలతో మమేకమయ్యుందుకు నిర్దేశించిన కార్యక్రమంలో దాదాపు 40 మందకి పైగా ఎంఎల్ఏలు సక్రమంగా పాల్గొనకపోవటంతో జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు కచ్చితంగా కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని కచ్చితంగా చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యం లేకపోతే అదే విషయాన్ని చెప్పేస్తే తాను నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటానని స్పష్టంగా చెప్పారట. దాంతో చాలామంది ఎంఎల్ఏలకు పెద్ద షాకే తగిలిందని సమాచారం. మరి వచ్చే నెలలో అయినా కార్యక్రమంలో పాల్గొంటారో లేదో చూడాలి.
Comments 1