36 ఏళ్లుగా ‘తానా’తో ఎడతెగని బంధం
అనేక రూపాల్లో ‘తానా’లో సేవలు
గెలిపిస్తే.. మరింత సేవ చేస్తానంటున్న ‘జగదీశ్ ప్రభల’
తనను గెలిపించాలని వినతి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) ఎన్నికల్లో కోశాధికారి (ట్రెజరర్) పదవికోసం బరిలో ఉన్నారు ‘జగదీశ్ ప్రభల’. దాదాపు 36 సంవత్సరాలుగా ఆయన ‘తానా’తో ఎగతెగని బంధాన్ని పెనవేసుకున్నారు. 1985, 1989, 1993లలో జరిగిన ‘తానా’ సదస్సులకు తల్లిదండ్రులతో కలిసి హాజరైన ‘జగదీశ్ ప్రభల’.. అప్పటి నుంచి ‘తానా’తో ప్రత్యేక బంధాన్ని పెంచుకున్నారు. నిజమైన కార్యకర్తగా ‘తానా’తో కలిసి పనిచేశారు. ఎంతో మంది ‘తానా’ అధ్యక్షులతోను, ప్రముఖులతోనూ ఆయన కలిసి పనిచేసి.. తలలో నాలుకగా వ్యవహరించారు. అనేక పదవులు సైతం అలంకరించారు. ప్రస్తుతం ‘తానా’ ఎన్నికల్లో కోశాధికారి పదవి కోసం పోటీ చేస్తున్నారు. గతంలో తనకు మద్దతిచ్చినట్టు ఇప్పుడు కూడా తనను గెలిపించాలని ‘జగదీశ్ ప్రభల’ కోరుతున్నారు.
‘తానా’లో ‘జగదీశ్ ప్రభల’ అడుగులు ఇవీ..
2007:’తానా’ వాషింగ్టన్ డీసీ సదస్సుకు సాంస్కృతిక కమిటీ సభ్యునిగా సేవలందించారు.
2009:‘తానా’ చికాగో సదస్సుకు సాంస్కృతిక కమిటీ కో చైర్మన్ వ్యవహరించారు.
2009-11:తెలుగు చర్చా పోటీలకు చైర్మన్గా పనిచేశారు.
2011-13:కమిటీ చైర్మన్గా ప్రభుత్వ గ్రాంట్స్, ఛేజ్ ఫేస్ బుక్ ఫౌండేషన్ ద్వారా 50 వేల డాలర్ల సేకరణ
2015:‘తానా ‘డిట్రాయిట్ కన్వెన్షన్ కార్పొరేట్ కో చైర్మన్గా వ్యవహరించారు.
2015-19:‘తానా’ స్పెషల్ కమిటీ
2017:‘తానా’ సెయింట్ లూయిస్ కన్వెన్షన్ కార్పొరేట్ స్పాన్సర్ షిప్ సలహాదారుగా పనిచేశారు.
2017-19:’తానా’ బోర్డ్ డైరెక్టర్స్ కార్యదర్శిగా సేవలు
2019-21:‘తానా’ బోర్డు కోశాధికారిగా, తానా పెట్టుబడులు, ఇతర ఆర్థిక విషయాల్లో సలహాదారుగా వ్యవహరించారు.
‘జగదీష్ ప్రభల’ అందించిన సేవా కార్యక్రమాలు
కరోనా సమయంలో హైదరాబాద్లో ‘పేద బ్రాహ్మణుల’కు నిత్యావరసర వస్తువులను పంపిణీ చేశారు.
అమెరికాలో దేవాలయాల కార్యక్రమాలకు విరాళాలు అందించారు.
తెలుగు భాషాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
‘జగదీష్ ప్రభల’ లక్ష్యాలు.. ఇవే!
‘తానా’ జమా ఖర్చుల విషయంలో పారదర్శకతను పాటించేలా చూడడం
‘తానా’కు గ్రాంట్ల ద్వారా నిధుల సేకరణకు ప్రయత్నించడం
‘తానా’ ఇతర కార్యక్రమాల్లో భాగస్వామ్య వహించడం. విజయవంతం చేయడం
అందిరితోనూ కలిసి పనిచేయడం. అందరినీ కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చూడడం.
‘తానా’ బైలాను గౌరవించడం, ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి పనిచేయడం.
‘తానా’ ద్వారా చేసిన సేవలు
2004-ప్రెసిడెంట్ టాకో(తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో)
2009-11 ప్రెసిడెంట్ ఫియా ఓహియో(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్)
2009 టాకో చైర్మన్గా 25వ సిల్వర్ జూబ్లీ
2009-11 కమ్యూనిటీ చైర్మన్గా భారతీయ హిందూ టెంపుల్(కొలంబస్) పనిచేశారు.
2012-13 టాకోకు రెండేళ్లు ట్రస్టీగా పనిచేశారు.