బాలీవుడ్ సెక్సీ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ మధ్య ఓ కేసులో చిక్కుకున్న సంగతి తెలుసు కదా. సుకేష్ చంద్రశేఖర్ అనే ఓ మోసగాడిని తిహార్ జైలులో కలిసినట్లు… ఆయన నుంచి విలువైన బహుమతులు తీసుకున్నట్లు… మనీ లాండరింగ్ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. తాజాగా జాక్వెలిన్, సుకేశ్ చంద్రశేఖర్లు మాంచి రసపట్టులో ఉన్న ఫొటోలు బయటపడ్డాయి.
అలాంటి ఫొటోలు బయటపడితే ఆగుతుందా… సోషల్ మీడియా మోత మోగిపోతోంది.దీంతో జాక్వలిన్ ఇన్స్టాన్ వేదికగా నాలుగు నీతి మాటలు పోస్ట్ చేసింది. ‘న్యాయం, మంచితనం ఎప్పటికైనా గెలుస్తాయి’ అంటూ ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
సోషల్ మీడియా యూజర్లు మాత్రం గెలిస్తే గెలవనీ.. ప్రస్తుతానికి నీ ఫొటోలు లోకమంతా చూడనీ అంటూ తెగ షేర్ చేసేస్తున్నారు.
ఇప్పటికే సుకేశ్, జాక్వెలిన్ల ఫొటోలు కొన్ని బయటకు రాగా శనివారం మరికొన్ని బయటకొచ్చాయి. అందులో సుకేష్ జాక్వెలిన్ ముక్కుపై ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలున్నాయి.
ఇవి వైరల్గా మారడంతో జాక్వెలిన్ ఇప్పుడు ఆ ఫొటోలు షేర్ చేయొద్దని కోరుతోంది. ‘‘నా స్నేహితులు, అభిమానులు నన్ను మంచిదానిగానే చూస్తారు. ఈ నమ్మకంతోనే నా పర్సలన్, సీక్రెట్ ఫొటోలు.. ప్రైవసీకి భంగం కలిగించే ఫొటోలను షేర్ చేయవద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నా. మీరు మీ సొంత వారికి ఇలా చేయరని కచ్చితంగా భావిస్తున్నా’’ అని తన ఇన్స్టా పోస్టులో జాక్వెలిన్ పేర్కొంది.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ తో పాటు జాక్వెలిన్, మరో నటి నోరా ఫతే పేర్లు వినిపిస్తున్నాయి.