జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సెలబ్రిటీలు మారిపోయారు. అయితే.. వీరందరిలో వినోద్ కాస్త డిపరెంట్. అసలుసిసలు అమ్మాయిలా ఉండే అతగాడి తీరు.. మేకప్ పుణ్యమా అని మగాళ్లే కాదు.. ఆడాళ్లకు హాట్ గా కనిపించేస్తుంటాడు. మిగిలిన వారితో పోలిస్తే.. వినోద్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పాలి. బుల్లితెర మీద తన స్కిట్ తో ఆకట్టుకునే వినోద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాడు.
ఒకట్రెండుసార్లు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలతో వార్తల్లోకి ఎక్కిన అతను.. కొద్ది నెలల క్రితం తాను ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసే విషయంలో నెలకొన్న లొల్లి మరోసారి అతన్ని వార్తల్లోకి వచ్చేలా చేసింది. కాచిగూడలో తాను ఉంటున్న అతను ఉంటుందన్న ఇంటిని కొనాలని అనుకోవటం.. అందుకు తగ్గట్లే ఇంటి యజమానితో అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించిన అతను.. తాజాగా ఆ ఇంటి విషయంలో యజమాని మాట మార్చారని.. వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అంబర్ పేటలోని డీసీపీ రమేష్ రెడ్డిని కలిశారు. వినతిపత్రం అందజేశారు. తాను అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరితే.. తన ఇంటి యజమాని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ వినోద్ కు రివర్స్ అయినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఇష్యూ ఇప్పటికే కోర్టులో ఉండటం.. దీనిపై విచారణ జరుగుతుండటంతో.. తామేమీ చేయలేమని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. తనకు న్యాయం చేయాలంటూ పలువురు కెమేరామెన్లను వెంటపెట్టుకొని డీసీపీ ఆఫీసుకు వెళ్లారు. కొందరు మీడియా ప్రతినిదులతో ముందే చెప్పి.. హంగామా చేసినవైనం షాకింగ్ గా మారింది. న్యాయం కోసం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించటం మామూలే. కానీ.. సెలబ్రిటీ స్టేటస్ ఉండి.. డీసీపీకి తాను ఇచ్చే కంప్లైంట్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వీలుగా కెమేరాలు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ హంగామా చూసిన డీసీపీ సీరియస్ అయి.. ఇలాంటివి చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరించటంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పలువురు కెమెరామెన్లను వెంటపెట్టుకొని రావటంతో మొదటికే మోసం వచ్చిన పరిస్థితి. అయినా.. అవసరానికి మించిన ఓవరాక్షన్ అవసరమా? అని ఈ ఎపిసోడ్ గురించి తెలిసిన వారంతా వినోద్ ను తిట్టి పోస్తున్నట్లుగా తెలుస్తోంది.