ఐవైఆర్ కృష్ణారావు .. చంద్రబాబు హయాంలో కీలక పదవి అనుభవించాడు. రిటైర్ అయ్యాక కూడా మంచి హోదా ఉన్న పదవి పొందాడు. కానీ జగన్ కాసిన్ని కాసులు ఇవ్వగానే (ఆరోపణలు) చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టాడు.
జగన్ ఎక్కించిన విషంతో నిత్యం ఒక కులంపై నిందలు వేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు. ఏపీలో ఏ ప్రభుత్వం విభాగం ప్రతినిధి లేదా ప్రధాన అధికారి పోస్టులో చూసినా రెడ్డే ఉంటాడు. 1983 వరకు ప్రతి ముఖ్యమంత్రి రెడ్డే గానీ… ఈయనకు మాత్రం ఇవేమీ కనపడవు. తన కష్టంతో తాను ఎదిగిన ఒక కులంపై మాత్రం నిత్యం అక్కసు వెళ్ల గక్కుతు ఉంటాడు.
తాజాగా అలాంటి ఒక అసూయతో రగిలిపోయి తట్టుకోలేక దానిని ట్వీట్ రూపంలో పెట్టాడు. అంతే జనం అతన్ని తగులుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పదవుల్లో ఉత్తరాది ఆధిపత్యం అందునా గుజరాతీ ఆధిపత్యం నడుస్తోందని అందరూ చెబుతున్నారు.
పక్క రాష్ట్రం వాళ్లు కూడా దక్షిణాదికి ప్రాధాన్యం దక్కడం లేదని మోడీపై ఆరోపణలు చేస్తున్నారు. దక్షిణాదిని గుర్తించని దగుల్బాజీ బీజేపీలో చేరిన ఈ బానిస మనస్తత్వపు మాజీ ఐఏఎస్ తన పార్టీ చేసిన చండాలాన్ని మరిచిపోయి ఈ ట్వీట్ వేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు.
నాకు గుర్తులేదు. తెలుగు వాడు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ తెలుగు మీడియా ఇంత హంగామా చేసిందా?
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 25, 2021
ఒక తెలుగు వాడు చీఫ్ జస్టిస్ అయితే తెలుగు మీడియా నే కదా హడావుడి చేసేది. ఇంత చిన్న లాజిక్ తెలియకపోతే ఎలా. ఇంకో విషయం పీవీ ప్రధాని అయినపుడు మీడియా ఇలా ఉందా? ఇంత సోషల్ మీడియా ఉందా ? లేదు కదా. అయినా అప్పటి అన్ని తెలుగు పత్రికలు భారీ ఎత్తున హడావుడి చేశాయి. అది ఈయనకు గుర్తులేదు. సిగ్గు విడిచి ఉత్తరాది పార్టీకి ఊడిగం చేస్తున్నారు.
ట్విస్ట్ ఏంటంటే… అతను అక్కసు అంతా కమ్మకులంపైనే. అందుకే ఆ ట్వీట్ వేశాడు. అయితే, అతను ఒక కీలక విషయాన్ని మరిచిపోయాడు. అప్పుడు బ్రాహ్మణ కులానికి చెందిన పీవీ నరసింహారావు ప్రధానిగా పోటీ చేస్తే… ఛీఛీ ఒక తెలుగు వాడిపై మనం పోటీకి పెట్టడమా అని తెలుగుదేశం తరఫున అభ్యర్థినే నిలపకుండా ఎన్టీఆర్ ఆరోజు పీవీని ప్రధానిగా కొనసాగడానికి దోహదపడే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఐవైఆర్ పొరపాటున మరిచిపోయినట్టున్నారు.
ఐవైఆర్ మరిచిపోయిన మరో విషయం… ఇపుడు తాను కొనసాగుతున్న ఉత్తరాది పార్టీ బీజేపీ పీవీని ప్రధాని పదవి నుంచి దించడానికి కుట్రతో పోటీకి పెట్టింది. దానికి ఇది సాక్ష్యం.
మాకు బాగా గుర్తుంది, పీవీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు కనీస పోటీ కూడా లేకుండా ఎన్టీఆర్ ఓ తెలుగువాడిగా గౌరవించారు. నువ్వు ఇప్పుడు ఉప్పేసుకుని మరీ నాకుతున్న పార్టీ మాత్రం పోటీ పెట్టిందని కూడా గుర్తుంది. ఐనా 30 ఏళ్ళ క్రితంవి కూడా గుర్తు లేనపుడు జీవితం చాలించడం మంచిదేమో ???????? pic.twitter.com/ljIzpWKub6
— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) April 25, 2021
ముందు వెనుక చూసుకోకుండా ట్వీటేసిన ఐవైఆర్ ను నెటిజన్లు ఏకిపడేస్తున్నారు.