కాలం అందరికీ జ్జానోదయం చేస్తుంది. అప్పట్లో చీటికిమాటికి జగన్ మాటలను ప్రచారం చేసి చంద్రబాబును డ్యామేజ్ చేయడానికి తన వంతు కృషిని పరోక్షంగా చేసిన ఐవైఆర్ కృష్ణారావు తాజాగా జగన్ రెడ్డి, సాక్షి పేపరు అబద్ధాలు చెప్పారా అప్పట్లో అంటు అనుమానాలు వ్యక్తంచేశారు. ఏమిటా విషయం అంటే పోలవరం అంచనాలు.
గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి అధికార పార్టీ తన అనుయాయులకు లబ్ది చేకూర్చే విధంగా పోలవరం అంచనాలను అమాంతం పెంచేసిందని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ పెద్ద పెట్టున ఆరోపించారని ఐవైఆర్ గుర్తుచేశారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు వేశారని అన్నారు. దీంతో సాక్షి ఎడిటర్ పై కొందరు అధికారులు పరువునష్టం దావాలు కూడా వేశారని వివరించారు.
ఆరోజు జగన్ రెడ్డి, ఆయన పత్రిక… అవసరం లేకపోయినా అంచనాలు పెంచారని, అదంతా దోచుకోవడానికే అని ఆరోపించిన జగన్ రెడ్డి… పోలవరం సవరించిన అంచనాల ప్రకారం కేంద్రమంత్రిని సీఎం జగన్ రూ.55 వేల కోట్లు ఇపుడు తాను దోచుకోవడానికి అడుగుతున్నారా అని అనుమానం వ్యక్తంచేశారు. లేదా అపుడు చంద్రబాబు సర్కారుపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని స్వయంగా జగన్ కన్ ఫం చేశారా ? అని నిలదీశారు.
ఈ విషయం ఐవైఆర్ కి తెలియనిది కాదు. జగన్ ఆరోపణలు చేసినపుడు కూడా దానిని ఖండించే అధికారం అవకాశం ఐవైఆర్ కృష్ణారావుకు ఆనాడే ఉంది. కానీ ఖండించలేదు. ఏపీకి జరిగిన నష్టానికి ఆయన కూబా బాధ్యుడే.