ఎనకటికి ఆడెవడో కోపమొచ్చి ఆకాశం మీద ఉమ్మేశాట్ట.. అది కాస్తా కొంచెం పైకెళ్ళి ఆడి ముఖం మీదే పడ్డదంట.. అట్టా ఉంది ఈ యవ్వారం.
ఢిల్లీలో కూచుని టీవీల్లో మాట్లాడుకుంటున్నాయన్ని తెచ్చి జెయిల్లో పెట్టేశాం… అదేదో రాజద్రోహం కేసు పెట్టేసాం కాబట్టి బయటకి రాలేడనుకుని చంకలు గుద్దుకునే లోపల..
కోర్టులో సీన్ రివర్స్ ఐంది.. అమరావతి కేసుల కోసం తెచ్చిపెట్టుకున్న వకీల్ సాబే దిమ్మ తిరిగే బొమ్మ చూపించేసాడు.
ఎవరి కాళ్ళు వాళ్లే ఫ్రాక్చరు చేసుకుంటారా?… ఆమాత్రం కామన్ సెన్స్ లేదా అని మొట్టికాయలు వేసింది.
అవి ఎడిమా బొబ్బలో – ఎడ్డినా దెబ్బలో కనపడట్లేదా అని కళ్ళెర్రజేసింది.
శిక్ష వేయించి కక్ష తీరుచ్కుందామనుకుంటే – మీ ఓవరాక్షన్ ఆపమని షాకిచ్చింది.
మొత్తానికి రాజుగారికి కోర్టు బెయిలిచ్చి – దర్జాగా బయటకు పంపేసింది..
అంతేనా.. సేం డే.. సేం కోర్ట్… సేం రిజల్ట్.. డబల్ బొనాంజా ఆఫర్.. ప్రభుత్వానికి సంబంధించి.. ఎలక్షన్ల విషయంలో ఇంకో దెబ్బా పడింది.. ఎలక్షన్ నిర్వహణ కేసులోనూ చుక్కెదురైంది..
సెక్రట్రీ అంటే డైరీ చూసి ఈ రోజు ప్రోగ్రాం ఎంటో చెప్పే పీ యే కాదు,
లేదా ఇది చెయ్యండి, అది చెయ్యండి అంటే చేసుకుంటూ పొయ్యే పెర్సనల్ సెక్రట్రీ కాదు.
ప్రిన్సిపల్ సెక్రట్రీ అంటే రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఒక బాధ్యత గల పొజీషన్ అని మర్చిపోయినట్టున్నారు. అటువంటిదే మరో బాధ్యతాయుత పొజీషన్ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ ఐనా. సీ ఎం కు ఒక పెర్సనల్ సెక్రట్రీలా వ్యవహరించి న్యాయ మూర్తుల చేతిలో అక్షింతలు వేయించుకున్నారు.
ఏతా వాతా తేలిందేంటంటే…కోర్టులు మనకి అచ్చిరావని.. ఎక్కువగా కెలికితే.. తనపైన కేసులు బయటకొస్తాయని సారు వారు గ్రహించకపోఏ..సూట్ కేసులు సద్దుకోడమే…శంకరగిరిమాన్యాలు పట్టుకుపోవల్సిందే…
అలా ఈరోజు కూడా అన్నిచోట్లా ఓడిపోయిన మన జగన్నాయకుడు..
తండ్రి పటం ముందు చేతులు జోడించి.. మౌనంగా ప్రార్ధిస్తుండగా..
వెనకాలెక్కడో బాక్గ్రౌండ్లోంచి పిల్లలు పాడుకుంటున్న పాట వినిపిస్తోంది
దెబ్బలు రాజు గారికి – బొబ్బలు రాజావారికి..
కేసులు రాజు గారికి – కేకలు రాజావారివి..
వాతలు రాజు గారికి – వాపులు రాజావారికీ..
బెయిలు రాజు గారికి – జెయిలు….