ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చద్ధా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ బాలీవుడ్ లోని ఓ వర్గం రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం తెలుగు మూవీ లైగర్ ను కూడా బాయ్ కాట్ చేయాలంటూ #boycottLiger ట్రెండ్ అవుతోంది. ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్, హీరోయిన్ అనన్య పాండేలపై వ్యతిరేకత ఉన్న కొంతమంది బాయ్ కాట్ టైగర్ ను గత రెండు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు.
దీంతోపాటు, లాల్ సింగ్ చద్ధా బాయ్ కాట్ ట్రెండ్ పై గతంలో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు కూడా ఇందుకు మరో కారణం. బాయ్ కాట్ చేయాలనుకునే వాళ్ళు సినిమాను బాయ్ కాట్ చేయొచ్చని, కానీ, సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చని విజయ్ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. అంతేకాదు, ప్రతి సినిమాకు 200 నుంచి 300 మంది టీం చాలా కష్టపడతారని, వాళ్ళందరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని అన్నాడు.
ఈ క్రమంలోనే లైగర్ ని కూడా బాయ్ కాట్ చేయాలని ఆ గ్యాంగ్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోని ఆ బాయ్ కాట్ గ్యాంగ్ కు హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బాయ్ కాట్ లైగన్ హ్యాష్ ట్యాగ్ కు కౌంటర్ గా #ISupportLIGER, #UnstoppableLIGERను రౌడీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఐ సపోర్ట్ టైగర్ కు బాలీవుడ్ నుంచి కూడా కొందరు ప్రముఖులు, నెటిజన్లు మద్దతిస్తున్నారు.
ఇక, దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి కూడా ఐ సపోర్ట్ టైగర్ కు చాలా మంది మద్దతిస్తున్నారు. ఇప్పుడు, ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే, నెగిటివ్ పబ్లిసిటీ కూడా సినిమాకు ప్లస్ అవుతున్న ఈ రోజుల్లో ఆల్రెడీ పాజిటివ్ వైబ్ తో ఉన్న లైగర్ మూవీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా తెలియాలంటే ఈ నెల 25 వరకు వేచి చూడక తప్పదు.