పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్” ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నల్ల చొక్కా వేసుకొని లుంగీ పైకి కట్టి మరీ ఊర మాస్ లుక్ లో పవన్ ఇచ్చిన ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భీమ్లా నాయక్ బీజీఎం పాటకు థమన్ ఇచ్చిన బీట్ కు తగ్గట్లుగా పవన్ ఫైట్ చేయడంలో…ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్ప్ తెప్పించింది. ఈ గ్లింప్స్ లో డైలాగ్, ఫైట్ తో పవన్ ఇరగదీశాడని ఆయన ఫ్యాన్స్ అనడంల ో ఎటువంటి సందేహం లేదు.
‘వకీల్ సాబ్’ తో హిట్ కొట్టిన పవన్….భీమ్లా నాయక్ వంటి మాస్ ఎంటర్ టైనర్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని పవన్, మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే, ఈ ఫస్ట్ గ్లింప్స్ లో కేవలం పవన్ మాత్రమే కనిపించడంపై రానా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఫస్ట్ గ్లింప్స్ ఒక్కటే కాదు…ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది పవన్ సినిమాగా ట్రీట్ చేయడం, రానా ఓ పాత్రలో నటిస్తున్నాడన్న ఫీల్ కలిగించడంపై కూడా రానా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట.
‘బాహుబలి’ వంటి భారీ హిట్ తర్వాత రానా కూడా స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారని, అంతకుముందు నుంచే బాలీవుడ్ లోని పలు హిట్ చిత్రాల్లో రానా నటించి మెప్పించారని, అయినా భీమ్లా నాయక్ ప్రమోషన్లలో, ఫస్ట్ గ్లింప్స్ లో రానా పేరు కూడా లేవనెత్తకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక, మరికొందరు ఫ్యాన్స్ అయితే ఇది మల్టీస్టారా? లేక పవన్ సోలో మూవీనా అని ప్రశ్నిస్తున్నారు.
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పయున్ కోషియమ్’ లో ఇద్దరు హీరోలకూ సమ ప్రాధాన్యత ఇచ్చారు. అయ్యప్పన్ నాయర్ గా మలయాళ హీరో బిజూ మీనన్, కోషి కురియన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ ఇద్దరూ ఢీ అంటే ఢీ అని పోటీపడి నటించేలా వారి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని, కానీ, ఇక్కడ పవన్ పై ఫోకస్ చేయడం వల్ల ఫ్యాన్స్ కు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అంటున్నారు.
మలయాళ చిత్ర టైటిల్ లోనూ రెండు పాత్రల పేర్లు కలిపి పెట్టారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క పవన్ పాత్ర పేరునే హైలెట్ చేయడంతో ఇది కచ్చితంగా పవన్ సినిమా అని, మల్టీ స్టారర్ కాదని రానా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. “మల్టీస్టారర్ మూవీని సోలో హీరో మూవీ చేసేశారు” అంటూ సోషల్ మీడియాలో ఓ అభిమాని చేసిన ట్వీట్ కు “భీమ్లా నాయక్” నిర్మాత నాగ వంశీ స్పందించారు. అప్పుడే ఒక నిర్ధారణకు రావొద్దని, అన్నీ ఆర్డర్ ప్రకారంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
త్వరలోనే సినిమాలో రానాకు సంబంధించిన గ్లింప్స్ లు, క్యారక్టర్ రివీల్ వీడియోలు ప్లాన్ చేయబోతున్నామని ఆయన హింట్ ఇచ్చారు. అయితే, టైటిల్ విషయంలోనే రానాను పక్కనబెట్టినపుడు, సినిమాలో ప్రాధాన్యతనిస్తారని ఎలా అనుకుంటామని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. రానా పాత్ర పేరు డేనీ శేఖర్ అని…ఆ పేరు టైటిల్ లేదని, మలయాళ సినిమాలో ఇద్దరు హీరోల పేర్లు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా, తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంపై ఫోకస్ చేయడం పోలేదని, మల్టీస్టారర్ లు చేసినా…ఒక హీరోను ఎలివేట్ చేయడం, లేదంటే ఇద్దరు హీరోలకు సమాన పాటలు, ఫైట్లు పెట్టడం వంటివి తప్పడం లేదని. ఈ కల్చర్ పోతేనే టాలీవుడ్ లోని మంచిసినిమాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.