కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉంటున్న భారతీయులకు, దక్షిణాది వారికి, ప్రత్యేకించి తెలుగువారికి ‘Inni Entertainments’ ఈవెంట్ కంపెనీ గురించి పరిచయం అక్కర లేదు.
డీజే నైట్స్ లో నార్త్ ఇండియన్ సాంగ్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్న సమయంలో ప్రత్యేకించి సౌత్ ఇండియన్స్ కోసం ఈ ఈవెంట్ కంపెనీని స్థాపించారు Prasanna Inni
తమ ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి నెలా లేదా సమయం, సందర్భాన్నిబట్టి ఒక ఈవెంట్ చేయాలని భావించిన ప్రసన్న ఇప్పటికే “పక్కా లోకల్”, ”కాశ్మోరా కాలింగ్”, ”లక్ష్మీ బాంబ్”, ”బుల్లెట్ బండి” వంటి పబ్లిక్ ఈవెంట్స్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు.
4 గంటలపాటు సాగే ఈవెంట్స్ లో లైవ్ పర్ఫార్మెన్స్, గేమ్స్, నాన్ స్టాప్ డ్యాన్సింగ్ తో వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటున్నారు.
దక్షిణాది హిట్ సాంగ్స్ తో పాటు బాలీవుడ్ లవ్ సాంగ్స్ కు అందరూ స్టెప్పులేసేలా ప్రోగ్రామ్ ను రూపొందిస్తున్నారు.
ఇలా ‘Inni Entertainments’ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూ ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైనందుకు Prasanna Inni ధన్యవాదాలు తెలిపారు.
ఒక సంవత్సరం క్రితం “పక్కా లోకల్” అనే ఈవెంట్తో బే ఏరియాలో తన జర్నీని ‘Inni Entertainments’ ప్రారంభించిందని చెప్పారు.
అప్పటి నుంచి బే ఏరియాలో ప్రాచుర్యం పొందిన ‘Inni Entertainments’ ఇప్పుడు అమెరికా అంతటా విస్తరించి ఎన్నారైలకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు 30కి పైగా అద్భుతమైన ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేశామని, ఎన్నారైల ప్రేమ మరియు మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని ‘Inni Entertainments’ వ్యవస్థాపకురాలు Prasanna Inni చెప్పారు.
తమ విజయానికి దోహదపడిన పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
‘Inni Entertainments’ కేవలం ప్రత్యేకమైన పేర్లతో కూడిన ఈవెంట్లతోనే కాకుండా, విభిన్న థీమ్ పార్టీలతో ఎల్లప్పుడూ అత్యుత్తమంగా నిలిచేందుకు ప్రయత్నించిందని Prasanna Inni చెప్పారు.
ప్రజలంతా తమ సెలవు రోజులలో సరదాగా గడపడం, ఎవరూ చూడడం లేదన్నట్లుగా మైమరిచిపోయి డ్యాన్స్ చేయడం, ఏ రకమైన నిరుత్సాహం లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లడం తమ ఈవెంట్ల ఉద్దేశ్యమని చెప్పారు.
ఓహియో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా మరియు జార్జియా వంటి అనేక ప్రధాన రాష్ట్రాల్లో ఈవెంట్లను ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించిందని అన్నారు.
ప్రధానంగా దక్షిణ భారత సంగీతంపై దృష్టి సారించడంతోపాటు బాలీవుడ్ బీట్లను అందించేందుకు ప్రయత్నించామని చెప్పారు.
ఇంతకాలం తమ ఈవెంట్లను ఆదరించినట్లుగానే రాబోయే ఈవెంట్లను ఆదరించాలని, ఆ ఈవెంట్లకు మీ మద్దతు మరియు ప్రోత్సాహం కోసం మేము ఎదురుచూస్తున్నామని Prasanna Inni చెప్పారు.
తమ ప్రయాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.