• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు!

admin by admin
November 2, 2022
in Around The World
0
0
SHARES
73
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి  ఇంటి ముందు గోడమీద బొగ్గు తో ” పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి” అని రాసేరు.

ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.

అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం.

ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు.

తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు.

తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు .

స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది.

కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి.

ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది.

పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది.

దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు.

సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు.

రాజాజీ కోపంతో ఊగిపోయాడు.

రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు

ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు.

దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు.

యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు.

అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు.

9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు.

అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు.

తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు.

అదీ తెలుగువారి ఐక్యత.

సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు.

తెలుగునాయకులంతా ముఖం చాటేశారు.

58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు.

టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు.

కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు.

వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు, కూరాళ్ల భుజంగం తదితరులు.

పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది.

ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు.

పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి.

కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి.

జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది.

వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది.

ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.

ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది.

తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు.

ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు.

చివరికి ఒంటరివాడిగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు.

ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు.

శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.

ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎ

వరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు.

వాంతు చేసుకున్నారు.

తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు.

వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు.

అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.

గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు.

అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు.

సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది.

శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది.

బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక….రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది.

షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది.

8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు.

నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది.

సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.

ఆ త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితం గా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది.

మిత్రులకు విన్నప్పము, ,ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన పొట్టిశ్రీరాములు ,ఘంటసాల,ప్రకాశం పంతులు గార్ల గొప్పతనం మరియు వారు స్పందించిన విధానము మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత…

Tags: amarajeevi potti sreeramulu
Previous Post

అమెరికాలో విస్తరిస్తున్న ‘Inni Entertainments’!

Next Post

అయ్యన్నపాత్రుడు అరెస్ట్!

Related Posts

president biden
Around The World

బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్

June 2, 2023
kcr and babu
Politics

చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట

June 1, 2023
Around The World

రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ

June 1, 2023
Andhra

దేశం కంచుకోటలో ‘కన్నాలక్ష్మీనారాయణ’ పాగా!

May 31, 2023
chandrababu in mahanadu
NRI

‘తెలుగు హెరిటేజ్ వీక్’…నార్త్ కరోలినా గవర్నర్ కు చంద్రబాబు ధన్యవాదాలు

May 30, 2023
jagan in parliament
Andhra

పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?

May 29, 2023
Load More
Next Post

అయ్యన్నపాత్రుడు అరెస్ట్!

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra