ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 55 శాతం ప్రకటించడం గమనార్హం. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, విశాఖ జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు కేటాయించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, తూర్పుగోదావరి జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు, కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు కేటాయించారు. గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, నెల్లూరు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు కేటాయించారు.
కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, అనంతపురం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 పోస్టులను కేటాయించారు.
కీలక పదవుల్లో ఎవరెవరంటే..
ఏపీ టిడ్కో చైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్
ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌గా వెంకట్‌రెడ్డి
ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డి పద్మావతి
ఏపీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా గేదెల బంగారమ్మ
ఏపీ వీఎంఆర్డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
ఏపీ బుడా చైర్మన్‌గా ఇంటి పార్వతి
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషు
మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ చైర్మన్‌గా హేమమాలిని
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా సమీమ్ అస్లాం
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్
ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మొండితోక కృష్ణ
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి పుణ్యసుశీల
ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్‌గా రామారావు
ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు
డీసీసీబీ చైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు
డీసీఎంఎస్ చైర్మన్‌గా అవనపు భావన
తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరమల్లి పద్మజ
ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నసీర్ అహ్మద్
కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా పాతపాటి సర్రాజు
లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్‌గా దయ్యాల నవీన్‌బాబు
నెడ్‌క్యాప్ చైర్మన్‌గా కేకే రాజు
సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు
పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్‌గా గంజిమాల దేవి
ఏలేశ్వరం డెవలప్మెంట్ బోర్డు చైర్ పర్సన్‌గా శైలజ
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి