చిరంజీవి. తెలుగు సినిమాకు దశాబ్దాల పాటు కళను తెచ్చిన నటుడు.
చాలా మంది హీరోలకు చాలా టాలెంట్లు ఉండొచ్చు కానీ చిరంజీవి వంటి ఆల్ రౌండర్స్ అరుదు అని బల్లగుద్ది చెప్పవచ్చు.
రాజకీయాలు మానేసి పూర్తిగా సినిమా పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి తీరు మారింది.
సినిమా పరిశ్రమకు ఏదైనా ఇబ్బంది వస్తే తన వంతుగా సినిమా పరిశ్రమకు అండగా నిలవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు.
అయితే… ఈ ప్రయత్నాన్ని చాలామంది… దాసరి పోయాక సినిమా పెద్దగా అవతరించడానికి చిరు చేస్తున్న ప్రయత్నం ఇది అని వ్యాఖ్యానించారు.
కొందరు దానిని ఒక కకృతిలా చిత్రీకరించే ప్రయత్నమూ చేశారు.
సున్నిత మనస్కుడైన చిరంజీవి పలుమార్లు నొచ్చుకున్నారు.
ఈ క్రమంలో జగన్ సీఎం అయ్యాక ఆ కుటుంబాన్ని మరింతగా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తన బంధువు అయిన మోహన్ బాబు చేతిలోకి పరిశ్రమను తేవడానికి జగన్ చేసిన ప్రయత్నంలో భాగమే చిరంజీవిపై నిందలు. వైసీపీ వాళ్లు చాలా వ్యూహాత్మకంగా చిరంజీవిని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
అయితే, పాపం చిరు అనేకమార్లు తన స్థాయి కూడా తగ్గించుకుని జగన్ పట్ల అభిమానాన్ని కురిపించారు. అయిన జగన్ చిరంజీవిని లైట్ తీసుకున్నారు. ఇక పవన్ పేరు చెప్పి సినిమాపై కక్ష కట్టారు. రాష్ట్రంలో సమస్యలు అన్నీ వదిలేసి సినిమాపై పగ పెంచుకున్నాడు. దీని వెనుక వ్యూహం ఏంటంటే… చిరంజీవి చేత అస్త్ర సన్యాసం చేయించి… ఆ తర్వాత మోహన్ బాబును రంగంలోకి దించడం ఇందులో ప్రధాన వ్యూహం.
జగన్ అనుకున్నట్టే జరిగింది.
చిరంజీవి విసుగెత్తిపోయాడు.
జగన్ కోరుకున్నది చేశాడు.
ఆదివారం నాడు ఓ ఛారిటీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ, ఇకపై తనను ‘ఇండస్ట్రీ హెడ్’ అని సంబోధించవద్దని అన్నారు. దయచేసి నన్ను ‘ఇండస్ట్రీ హెడ్’ అని పిలవడం మానేయండి అని కోరారు.
“నా సినీ పరిశ్రమ వారికి నేను ఇకపై కూడా అండగా ఉంటాను. కానీ, ఇకపై ఈ బిరుదులు అక్కర్లేదు. పెద్దన్న అని పిలవడం కంటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండటమే మంచిదని భావిస్తున్నాను.”
చిరంజీవి మాటల్లో చాలా లోతు కనిపిస్తోంది. ఇదే జగన్ కి కావల్సింది.
అనుకున్నట్టే చిరంజీవి ఉదయం ఈ మాట అన్నాడు. సాయంత్రానికి మోహన్ బాబు రంగంలోకి దిగాడు.
జగన్ అనే వ్యక్తి ఇబ్బందులు అదేపనిగా సృష్టిస్తే పల్లెత్తు మాట అనకుండా అందరూ పోయి అడుక్కుందాం అన్నట్టు లేఖ రాశాడు.
అయినా అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే వచ్చే పెద్దరికం పెద్దరికం ఎన్నటికీ కాదు. తనకు ఆ అండ పోయాక మోహన్ బాబు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి.
చిరంజీవి పెద్దరిరికానికి కావాలనే అవమానం
తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు ఎలాంటి కష్టాలు వచ్చినా ముందుగా స్పందించే వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. ఇటీవలి కాలంలో కూడా, టిక్కెట్ ధర సమస్యను చిరంజీవి ప్రస్తావించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి ప్రయత్నించారు. రెడ్డి కాకపోవడం వల్ల చిరుకు జగన్ నుంచి పిలుపురాలేదు.
కొద్దిరోజుల క్రితం MAA ఎన్నికలలోను చిరంజీవిని గబ్బు పట్టించే ప్రయత్నం చేశారు. కానీ అతను ఆ వ్యాఖ్యలపై ఎప్పుడూ స్పందించలేదు, ఇది వివాదాల పట్ల చిరంజీవి ఎంత దూరంగా ఉంటారో తెలుపుతుంది. పాపం మీడియా గట్టిగా అడిగితే… మీకు కావల్సిన మసాలా దొరికిందిగా మీరు హ్యాపీనా అంటూ వెళ్లిపోయారు.