సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో, తెలుగు వాడి ఆత్మగౌరవమే లక్ష్యంగా స్థాపించబడి, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ, తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పూర్తి చేసుకున్న శుభ వేడుకను యూకే , యూరప్ లోని దాదాపు 40కి పైగా నగరాల్లో ఎన్నారై తెలుగుదేశం శ్రేణులు అంగరంగవైభవంగా ఎన్నారై టీడీపీ నేత వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
యూకే & యూరప్ లోని ఎన్నారై కౌన్సిల్ సభ్యుల సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతి ప్రాంతం నుంచి పాల్గొన్న తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు గారిని జోహర్ ఎన్టీఆర్..జోహర్.. అంటూ స్మరించుకున్నారు.
జై బాబు..జై జై బాబు అంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి గారి నాయకత్వాన్ని బలపరిచారు. పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ అధినాయకత్వం, స్థానిక కార్యకర్తలతో సమిష్టిగా కృషి చేసి తిరిగి తెలుగుదేశం జెండా గర్వంగా ఎగిరేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను, అప్పుల ఊబిగా రాష్ట్రాన్ని ఎలా మారుస్తున్నారో, ప్రజాజీవితం ఎంత దుర్భరంగా మారిందో ప్రజల్లోకి విస్తృతంగా అన్ని రకాల మాధ్యమాల ద్వారా తీసుకెళ్తామని తెలియజేశారు.
యూరోప్ టీడీపీ కౌన్సెలర్స్ యూకే – జయ్ కుమార్ గుంటుపల్లి, ప్రసన్న నాదెండ్ల , నరేష్ మల్లినేని, చక్రి మొవ్వ , శ్రీకాంత్ యర్రం , మహేంద్ర తాళ్లూరి , నారాయణ రెడ్డి , విక్రమ్ పరిటాల , శివరాం కూరపాటి , సురేష్ కోరం , భాస్కర్ అమ్మినేని , ప్రభాకర్ అమిరినేని , శ్రీనివాస్ లగడపాటి , సుందర్ రాజు , శ్రీ కిరణ్ పరుచూరి , శ్రీనివాస్ పాలడుగు , భానూజి కుక్కల, చందు నారా ,శ్రీధర్ నారా , చందు జాస్తి , యస్వంత్ , రవితేజ లింగ , హర్ష చప్పిడి , మహాశ్వర్ కందుల , రూప్ తేజ , లీలా సాయి ఈదర , రవితేజ నల్లమోతు , నరేంద్ర ములకలపల్లి , సాయి కుర్ర , అభినయ్ కాపా , రవికిరణ్ అర్వపల్లి, వేణు పంగులూరి
ఐర్లాండ్ – మురళి రాపర్ల
జర్మనీ – టిట్టు మద్దిపట్ల , శివ
ఫ్రాన్స్ – మహేష్
బెల్ఫాస్ట్ – దినేష్ కుదరవల్లి
బ్రస్సెల్స్ – దినేష్ వర్మ
పోలాండ్ – చందు
ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ తెలుగు జాతి నిండు గౌరవము అన్నట్లు, మేము ఎక్కడ, ఎంతదూరాన ఉన్నా, మా ఆలోచనలు సొంత రాష్ట్రం గురించే ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే దాకా విశ్రమించమని పోపూరి వేణు మాధవ్ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు.
జై తెలుగుదేశం
జై చంద్రబాబు
జోహార్ ఎన్టీఆర్