రాజకీయాల్లో ఏమైనాజరగొచ్చు. ఇలానే జరగాలని నాయకులు అనుకున్నా.. ప్రజాభిప్రాయం.. ప్రజల ఆమోదం వంటివి నాయకులకు.. పార్టీలకు కూడా ప్రాణ ప్రదం. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం ముగిసిన ఎన్నికల్లో వైసీపీ వైపు గుండుగుత్తగా ప్రజలు ఉన్నారని చెప్పలేం. అర్బన్ ఓటు బ్యాంకు అంతా టీడీపీకి అనుకూలంగా ఉంది. మరోవైపు 2019లో జగన్ను కీర్తించి.. భుజాలపై ఎక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వంటివారు.. పార్టీకి దూరమయ్యారు. ఈ ప్రభావం పార్టీపై ఖచ్చితంగా ఉంది.
దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో వైసీపీ అంచనాలు భిన్నంగా మారే అవకాశం లేదనేందుకు చాన్స్లేదు. ఇదే జరిగితే.. అంటే.. వైసీపీ కనుక ఓడిపోతే.. నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. సీఎం జగన్ పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆయనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన 13 కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. రేపు మరోసారి ఇవి మొదటి నుంచి విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా సీఎం జగన్.. శుక్రవారం .. శుక్రవారం .. కోర్టుకు వెళ్లకతప్పదు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగాఉన్న జగన్.. 2014-19 మధ్యకాలంలో కోర్టు లచుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీంతో ఆయనను అప్పటి మంత్రి దేవినేని ఉమా సహా అనేక మంది టీడీపీ నాయకులు ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు కూడా అదేపరిస్థితి ఎదురు కానుంది. ఇవి గతంలో నమోదైన కేసులు. జగన్సీఎంగా ఉన్న సమయంలో కూడా విచారణ జరిగినా.. తాను సీఎంగా ఉన్నానని.. కాబట్టి విచారణకు రాలేదని చెప్పి.. కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకున్నారనే వాదన ఉంది.
కానీ, రేపు పార్టీ కనుక ఓడిపోతే.. సీఎం జగన్.. ప్రతిపక్ష నాయకుడిగా మారనున్నారు. ఇదే జరిగితే.. ఆయన కోర్టుల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం లేదు. పైగా ప్రతిపక్షానికి కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ఏమేరకు సహకరిస్తుందనేది చెప్పడం కష్టం. ఫలితంగా జగన్ ఇకపై ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇదేసమయంలో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపెట్టే కేసులు దీనికి అదనంగామారనున్నాయి. మొత్తానికి.. వచ్చే ఐదేళ్లు జగన్కోర్టు.. న్యాయపోరాటాలతోనే సరిపుచ్చాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.