రాజధానిని తరలించడం అంత సులువు కాదని జగన్ కి తెలుసు.
రాజధానిని తరలించాలనీ లేదు.
కానీ అమరావతిని అభివృద్ధి చేస్తే తనకేంటి? అని జగన్ లెక్కలేసుకున్నాడు.
అంతే… మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టాడు.
ఉన్న నగరాన్ని రాజధాని అని అనుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందుతుందా?
అలా అయితే దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం ఐదారు రాష్ట్రాలే ఎందుకు అభివృద్ధి చెంది ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి? కారణం రాజధాని ప్రాంతంగా మారినంతనే ఏదీ అభివృద్ధి చెందదు. పెట్టడులు తేగలిగే సత్తా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.
అయితే, జగన్ విశాఖ ప్రజల్లో ఒక నెరవేరని కలను నాటాడు. దాని కారణంగా తాను ఏ పనీ చేయకుండా విశాఖ ప్రజల్లో ఓటు లబ్ధి పొందొచ్చు అనుకున్నాడు.
కట్ చేస్తే… వైజాగ్ స్టీల్ జగన్ కి ఉరేసేలా ఉంది.
ఏమో రాజధాని వస్తుందేమో… జగన్ తెస్తాడేమో అనుకున్న వారికి కళ్లు బైర్లు కమ్మే షాక్.
రాజధాని రావడం అటుంచితే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు మనకు కాకుండా పోతోంది. అంటే అసలుకే మోసం.
లేని రాజధాని ఎలాగూ లేదు
ఉన్న ఉక్కు పరిశ్రమ పాయె.
ఇపుడు జగన్ అసలు సమర్థత ఉత్తరాంధ్రప్రజలకు అర్థమైపోయింది. విశాఖ ఉక్కు నిలబడితేనే జగన్ చరిత్రలో నిలుస్తాడు. లేకపోతే అత్యంత విఫల సీఎంగా చరిత్రకెక్కుతాడు… కానీ తనే స్వయంగా పోస్కో ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించిన జగన్ విశాఖ ఉక్కును కాపాడగలరా?
వైజాగ్ ప్రజలకు జగన్ అసలు రూపం ఇపుడు విదితం కానుంది.