• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ ఐఏఎస్‌ జంటను ఆడేసుకుంటున్నారుగా!

కుక్క‌తో వాకింగ్.. ఐఏఎస్ దంప‌తుల‌పై బ‌దిలీ వేటు.. ఏం జ‌రిగిందంటే!

admin by admin
May 27, 2022
in Around The World, India, Top Stories
0
0
SHARES
377
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పెంపుడు కుక్కను ఈవినింగ్‌ వాక్‌ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం, ఆ ఐఏఎస్‌ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించడం.. నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్‌ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా..  ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ.

అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్‌లో కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. ఐఏఎస్‌ జంట అయిన సంజీవ్‌ ఖీరావర్‌, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్‌ను లడఖ్‌, దుగ్గాను అరుణాచల్‌ ప్రదేశ్‌ను బదిలీ చేస్తూ..  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ  శిక్ష విధించింది.

ఈ తరుణంలో.. నెట్‌లో కుక్క మీమ్స్‌ నవ్వులు పూస్తున్నాయి. పూల్‌ ఔర్‌ కాంటే సినిమాలోని అజయ్‌ దేవగణ్‌ ఫేమస్‌ స్టంట్‌ను ఈ జంటపై ప్రయోగించాడు ఓ నెటిజన్‌. అక్కడి నుంచి మొదలైన.. కుక్క ట్రెండ్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

ఇద్దరూ చెరోవైపు వెళ్లారని, పాపం ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని ఫన్‌ పుట్టిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. త్యాగరాజ్‌ స్టేడియంలో ఈ జంట కోసం అథ్లెట్లను వెళ్లగొట్టిన ఘటనపై ఢిల్లీ సీఎస్‌ దగ్గరి నుంచి నివేదిక తెప్పించుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆపైనే బదిలీ చర్యలు తీసుకుంది.

ఏం జ‌రిగిందంటే

ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంలో సాధారణంగా సాయంత్రం ఏడు గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీ ఉంటుంది. అయితే, ఢిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్‌ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే (సాయంత్రం 7గంటలు) ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తున్నారు. అనంతరం ఓ అరగంట తర్వాత ఆ ఐఏఎస్‌ అధికారి తన పెంపుడు శునకంతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగ్‌ చేసుకుంటున్నారు.

గత కొన్ని నెలలుగా ఐఏఎస్‌ అధికారి చేస్తున్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని.. ఐఏఎస్‌ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం వల్ల ప్రతిపక్షాలు కూడా ఐఏఎస్‌ తీరుపై మండిపడ్డాయి. దేశ రాజధానిలోని ఉన్నతాధికారులే ఇలా ప్రవర్తిస్తే ఇక జిల్లా స్థాయిలో వారితీరు ఎలా ఉంటుందునని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ విమర్శలు గుప్పించారు.

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేంద్రం.. ఢిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ దంపతులను బదిలీ చేసింది. AGMUT క్యాడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది హోం మంత్రిత్వ శాఖ.

Tags: Delhiiasias dogIndia
Previous Post

TTA సంబరాలకు భారీగా ఏర్పాట్లు

Next Post

Kuwait NRI TDP-కువైట్ తెలుగుదేశం అధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు

Related Posts

Andhra

మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!

March 25, 2025
Andhra

మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు

March 25, 2025
Andhra

మ్యాగజైన్ స్టోరీ: జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం

March 25, 2025
Andhra

నిరుద్యోగుల‌కు చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌

March 25, 2025
Andhra

మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తా: జ‌గ‌న్‌

March 25, 2025
pawan kalyan and chandrababu meeting
Andhra

4 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రెడీ?

March 25, 2025
Load More
Next Post

Kuwait NRI TDP-కువైట్ తెలుగుదేశం అధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!
  • మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు
  • మ్యాగజైన్ స్టోరీ: జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం
  • నిరుద్యోగుల‌కు చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌
  • ఇక జర్నలిస్టులు అనే జీవులు కనిపించకుండా పోతారా..?!
  • మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తా: జ‌గ‌న్‌
  • 4 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రెడీ?
  • బిజీ బిజీగా వైసీపీ నేత‌లు.. లిస్ట్‌లో చేరిన‌ కాకాణి!
  • సినిమాలకు గుడ్ బై.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లారిటీ!
  • బెట్టింగ్ యాప్స్ కేసు.. శ్యామల ఏమందంటే?
  • ఆ నాలుగు దేశాల ప్రజలకు ట్రంప్ షాక్
  • విజయ్ పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు
  • రజనీ కి ఇచ్చి పడేసిన లావు!
  • విడ‌ద‌ల ర‌జిని కి ప్రత్తిపాటి కౌంట‌ర్‌..!
  • టీడీపీలోకి రాపాక‌.. జ‌న‌సేన గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra