ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985 బ్యాచ్ IAS అధికారి సమీర్ శర్మను కొత్త చీఫ్ సెక్రటరీగా బుధవారం నియమించింది.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ సెప్టెంబర్ 30 న సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 న సమీర్ శర్మ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రస్తుతం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్ఆర్డీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ పనిచేస్తున్నారు.
ఈయన చాలాకాం నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. AP ప్రభుత్వ అభ్యర్థన మేరకు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న శర్మను కేంద్రం ఈ ఏడాది జూన్‌లో తన మాతృ కేడర్‌కు తిరిగి పంపింది.
సీఎస్ పోస్టు పెద్దదే అయ్యుండొచ్చు గాని… మరి జగన్ వద్ద ఎలా ఇముడుతారో ఆయన చూడాల్సిందే.