అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’ లో ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలతో భేటీ అయిన లోకేష్..ఆ తర్వాత తన రాజకీయ ప్రస్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓర్పు, సహనం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం వంటివి చంద్రబాబు గారిని చూసి నేర్చుకున్నానని లోకేష్ అన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, ఓడిపోయిన చోటే పని చేసి ప్రజల మనసు, ఎన్నికలు రెండూ గెలిచానని మంగళగిరి విజయం గురించి లోకేష్ చెప్పారు.
తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖను ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, ఇటువంటి సవాళ్లను స్వీకరించినప్పుడే ప్రజా సేవ చేయగలుగుతామని అన్నారు. 226 రోజుల ‘‘యువగళం’’ పాదయాత్ర తనకు చాలా విషయాలు నేర్పిందని, రైతుల సమస్యలు,కష్టాలు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. తన కుటుంబం కూడా తనకు పాదయాత్ర చేసే సమయంలో అండగా నిలబడిందని గుర్తు చేసుకున్నారు.
ఒక చిన్న ప్రయత్నంతో 45 మంది దివ్యాంగ విద్యార్ధుల జీవితాలు నిలబెట్టామని, ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. విజయవాడ వరదల్లో డ్రోన్స్ వాడకం ప్రయోగం సక్సెస్ అయ్యిందని, వ్యవసాయం, వైద్యం, ఇతం రంగాల్లో డ్రోన్స్ ఉపయోగించి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.
https://x.com/i/status/1851497240361095266