‘జగన్ పాలనలో నేను ఉద్యమం చేయలేదు. నేను చేతకాని వాడిని అసమర్థుడిని, అమ్ముడుపోయాను. కాబట్టి కాపుల కోరిక నెరవేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. కాపుల చిరకాల కోరిక తీర్చే, దమ్ము, ధైర్యం మీకున్నాయి. కాపులకు రిజర్వేషన్, ఆంధ్రకు ప్రత్యేకహోదా కోసం కృషిచేయండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి. మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురుము ఉన్నాం.. అందరినీ చంపించేయండి’ అని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు.
మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను. నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నాను అయినా వేధిస్తున్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి అని ముద్రగడ అన్నారు.
వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై చేస్తున్న దాడులు వెంటనే ఆపాలి. నేను చేతకాని వాడిని అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 70 వేల మెజారిటీతో గెలిచి.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ముద్రగడపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. తాను సవాలులో పేరుమార్పు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయినా ట్రోలింగ్ ఆగకపోవడంతో వెంటనే ఆపాలని ముద్రగడ విజ్ఞప్తి చేశాడు.