హైపర్ ఆది పంచ్ లకు పెట్టింది పేరు. అతని స్కిట్ లో పంచ్ లు వినడానికి ప్రేక్షకులే కాదు, జబర్దస్త్ జడ్జిలు కూడా ఎదురుచూస్తుంటారు. ఎవరి మీదైనా పంచ్ లు వేయడం ఆదికి అలవాటే.
అయితే, అతను స్కిట్ దాటి బయట కూడా పంచ్ లు వేస్తున్నాడు. తనకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ పిల్లలపై కూడా పంచ్ వేశాడు హైపర్ ఆది. అయితే అది నెగెటివ్ పంచ్ కాదు, పాజిటివ్ పంచ్. మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ హైటే. ఒక అల్లు ఫ్యామిలీ తప్ప. ఇక మొత్తం బ్యాచ్ లో అందరికంటే హైట్ అకీరానందన్.
నిహారిక పెళ్లిలోని ఒక ఫోటో హైపర్ ఆది షేర్ చేస్తూ ‘‘చిన్నారి ఆదిత్య’’ … ఈఫిల్ టవర్ ‘‘అకీరా’’ అంటూ పంచ్ వేశాడు. ఆదిత్యను ఏం కామెంట్ చేయలేదు గాని అకీరాను మాత్రం ఈఫిల్ టవర్ తో పోల్చాడు. నిజంగానే అకీరా హైట్ పై చాలా చర్చ జరుగుతోంది. ప్రభాస్ కంటే కూడా అకీరా హైట్ ఎక్కువట. అకీరా హైట్ కచ్చితంగా చెప్పాలంటే 6 అడగుల 4 అంగుళాలు.
అయితే, అకీరా హైట్ గురించి ఈ చర్చ కొత్తది కాదు, గతంలో రాంచరణ్, వరుణ్ తేజ్ కూడా అకీరా హైట్ పై పంచ్ లు వేశారు. రాంచరణ్ అతన్ని ‘మై టాల్ లిటిల్ బ్రదర్‘ అని కామెంట్ చేశాడు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఏమన్నాడో తెలుసా… ఇంతకాలానికి మా కుటుంబంలో ఒక వ్యక్తిని నేను తలెత్తి చూడగలుగుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఈ రెండు కామెంట్లు వైరల్ అయిన విషయం తెలిసిందే.