• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

హైకోర్టు ‘షాక్’: హైదరాబాద్ పోలీసు అధికారులకు 4 వారాలు జైలు

admin by admin
June 7, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
312
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నిబంధనల్ని పాటించని అధికారులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతం నిలుస్తుంది. భార్యభర్తలకు చెందిన వివాదంలో భార్య ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని.. కేసు నమోదు చేసే క్రమంలో హైదరాబాద్ కు చెందిన నలుగురు పోలీసు అధికారులు వ్యవహరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు.. వారికి నాలుగు వారాలు జైలుశిక్ష విధిస్తూ ఇచ్చిన ఆదేశం సంచలనంగా మారింది. ఇంతకు వారు చేసిన భారీ తప్పు.. నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కాకపోవటమే.

సాధారణంగా ఎవరైనా ఎవరి మీదనైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు 41ఏ సీఆర్ పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వారి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. అలాంటివేమీ ఫాలో కాకుండా తమకు తోచినట్లుగా వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకూ ఈ వివాదం ఏమిటి? అది కాక నలుగురు పోలీసు అధికారులకు జైలు వరకు వెళ్లిన ఉదంతం ఏమిటన్న విషయంలోకి వెళితే..జక్కా వినోద్.. జక్కా సౌజన్యలు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భర్త మీద భార్య పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం భర్త మీద భార్య ఫిర్యాదు చేసినప్పుడు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు.. 41ఏ సీఆర్ సీపీ కింద నోటీసులు ఇవ్వాలి. దర్యాప్తు చేయాలి. కంప్లైంట్ ఎవరి మీద వచ్చిందో వారి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా.. తమ విచారణలో తేలిన అంశాల్ని పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకు భిన్నంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జక్కా వినోద్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న విషయాన్ని హైకోర్టు ముందుంచారు. దీనిపై  వాదనలు విన్న హైకోర్టు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ (ప్రస్తుతం.. అప్పట్లో డీసీపీ).. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్.. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి.. ఎస్ ఐ నరేశ్ లకు నాలుగు వారాలు జైలుశిక్ష విధించటంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది.

అయితే.. జైలుశిక్షను వెంటనే అమలు చేయకుండా.. తమ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాలు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వారు అప్పీలుకు వెళ్లి.. తమ వాదనను వినిపించటం ద్వారా జైలుశిక్ష నుంచి ఉపశమనం పొందే వీలుందని చెబుతున్నారు. అయితే.. శాఖాపరమైన చర్యల విషయంలో వారికి ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఈ ఆదేశంతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది.

Tags: Hyderabad policeTelanganatg police
Previous Post

బాబు- జగన్ : నాడు 95 శాతం నేడు 65 శాతం

Next Post

Samanha Bra: బ్రాతో రెచ్చిపోయిన సమంత

Related Posts

ys vivekananda reddy murder case
Andhra

వివేకా దారుణ హ‌త్య‌ కేసులో ఏ9 ఎవ‌రు?:  ఎంపీ ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు

June 9, 2023
Top Stories

మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్

June 9, 2023
Top Stories

భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్

June 9, 2023
Trending

మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు

June 9, 2023
Trending

వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న

June 9, 2023
Trending

మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం

June 9, 2023
Load More
Next Post

Samanha Bra: బ్రాతో రెచ్చిపోయిన సమంత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వివేకా దారుణ హ‌త్య‌ కేసులో ఏ9 ఎవ‌రు?:  ఎంపీ ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు
  • మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్
  • భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్
  • మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు
  • వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న
  • మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం
  • ఆమెను చూసి సాష్టాంగ నమస్కారం పెట్టేసిన స్టార్ హీరో
  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra