గత ఏడాది, నటి మీరా చోప్రా కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే.
ఆమెను కొందరు ట్విట్టర్లో అసభ్యకరమైన, అవమానకరమైన సందేశాలతో తిట్టారు. వాటిపై బెదిరిపోయిన మీరా చోప్రా హైదరాబాద్ పోలీసులకు ఆన్లైన్ ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాదు పోలీసులు ట్విట్టరుకు నోటీసు సర్వ్ చేశారు.
గత ఏడాది నటి మీరా చోప్రా గురించి బెదిరింపులు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలపై సమాచారం కోరుతూ పోలీసులు ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు.
టీవీ 9 మీడియాతో ఎసిపి ప్రసాద్ మాట్లాడుతూ, ట్విట్టర్లో నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తొలగించినా కూడా నిందితులను పట్టుకుంటామని, వారి వేటలో ఉన్నామని అన్నారు.
కొత్త ఐటి నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇండియా ఫిర్యాదుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందున అవసరమైన అక్కడ నుంచి తీసుకుంటామన్నారు.