హెడ్డింగ్ చదివినంతనే విషయాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లుగా అనిపిస్తుంది. కానీ… వాస్తవం అదే. వరుస పరిణామాల్ని లోతుగా పరిశీభర్తలించినప్పుడు.. అసలీ విషాదాలకు ఆరంభం ఎక్కడన్నది ఆలోచించినప్పుడు… మూలం అర్థమైపోయింది.
హైదరాబాద్ మహానగరంలో నివసించే ఆ భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే. భర్త (అజయ్ కుమార్) ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్. భార్య(సుజాత) ఒక మండలానికి తహసీల్దారు. వారికి ఒక్కగానొక్క కొడుకు. చక్కని జీవితం.. చేతి నిండా ఆదాయం. జీవితానికి ఇంకేం కావాలి. ఏ విధంగా చూసుకున్నా.. ఎలాంటి ఇబ్బంది లేని వారి జీవితాల్లోకి అవినీతి అనే విషపు చుక్క ఒకటి పడింది. పండంటి కాపురం కకావికలమైంది. అనూహ్య పరిణామాలతో ఉక్కిరిబిక్కిరైంది. చివరకు ఇప్పుడా కుటుంబంలో శశ్మాన నిశ్శబ్దం తాండవిస్తోంది.
రెండేళ్ల క్రితం అంటే.. 2020లో హైదరాబాద్ మహనగరంలోనే అత్యంత ఖరీదైన భూములు ఉన్న ప్రాంతాల్లో ఒకటైన షేక్ పేట తహసీల్దారుగా సుజాత విధులు నిర్వహిస్తుండేవారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా నగదు దొరికింది. దీంతో ఆమె జైలుపాలయ్యారు.
అనంతరం ఆమె భర్త.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ ను పోలీసులు విచారణకు పిలిచారు.
ఆ అవమానం తట్టుకోలేక విచారణకు హాజరు కాకుండానే భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త ఆత్మహత్య చేసుకోవటం.. అవినీతి కేసులో అరెస్టులు.. సస్పెన్షన్లతో మానసిక వేదనకు గురైన సుజాత ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్నది. కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. మూడు నెలల క్రితం నిమ్స్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో జులైలో కీమోథెరపీ చికిత్స చేస్తున్నారు.
అనంతరం డిశ్చార్జి అయినప్పటికీ ఆగస్టు రెండో వారంలో మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తూ.. మరోసారి కీమోథెరపీ చేటప్టారు. దీంతో.. శుక్రవారం గుండెపోటుకు గురైన ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీనికి ముందు ఆమె డెంగీ.. కరోనా బారిన కూడా పడినట్లుగా పేర్కొన్నారు.
తొలుత ఆమె మరణాన్ని ఆత్మహత్యగా.. అనుమానాస్పద మరణంగా పలువురు వాట్సాప్ సందేశాలతోనూ.. సోషల్ మీడియాలోనూ రాగా.. కొన్ని టీవీ చానళ్లు అత్యుత్సాహంతో ఇలాంటి వివరాల్నే ప్రసారం చేశాయి. తర్వాత ఆమె బ్లడ్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లుగా నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. వీరి కొడుక్కి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. సంతోషాల పొదరిల్లు మాదిరి ఉండాల్సిన కుటుంబం అవినీతి వీరి దరికి చేరకుంటే ఇంకోలా ఉండేవారనటంలో ఎలాంటి సందేహం లేదు.
pertaining to prime land in the upmarket Banjara Hills area. Anti Corruption Bureau (ACB) raided Sujatha’s residence and discovered cash amounting to Rs 30 lakh apart from gold ornaments and other valuables. Sujatha earlier worked as MRO of Amberpet and Mushirabad zones pic.twitter.com/gXLkMWuc1b
— Minhaj Hussain Syeed (@MinhajHussains) September 3, 2022
I would like to thank you for the efforts youve put in writing this website. Im hoping to check out the same high-grade blog posts from you later on as well. In truth, your creative writing abilities has inspired me to get my very own blog now 😉