హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో రోజుకొక కొత్త పేరు తెరపైకి వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి మొదలైనప్పటి నుంచి కొండా సురేఖను బరిలోకి దింపారని భావించారు. అయితే ఆమె కాంగ్రెస్ అధిష్టానం ముందు కొన్ని డిమాండ్లు పెట్టిందని, అందువల్లే సురేఖను అభ్యర్థిగా నిలపాలా లేదా అనే దానిపై సమాలోనలో పడ్డారు.
ఇంతలోనే అనూహ్యంగా ఎమ్మెల్యే సీతక్కను హుజురాబాద్‌లో నిలబెట్టాలనే కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. సీతక్క విషయాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
సీతక్క పోటీకి సుముఖంగా ఉంటే వెంటనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
సీతక్కకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. కరోనా సమయంలో ప్రజాప్రతినిధులందరూ ఇళ్లకే పరిమితయ్యారు. ఆమె కరోనాను లెక్క చేయకుండా గుట్టలు, వాగులు దాటుకుంటూ సహాయ కార్యక్రమాలు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఎవరి ఇబ్బంది ఎదురైనా సీతక్క అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రజల కష్టాలకు ఆమె చలించిపోతారు. అందువల్లే సీతక్కను ఉప ఎన్నికలో నిలబెడితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు.
హుజురాబాద్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీ దామోదరం రాజనర్సింహా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్థానికులే టికెట్ ఇవ్వాలని ప్రతిపాధించారు. అయితే మిగతా నేతలు కొండా సురేఖపై ముగ్గుచూశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలువలేదు. హుజురాబాద్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇందులో భాగంగానే అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే సీతక్క అభ్యర్థిత్వాన్ని అందరూ ఆమోదించే అవకాశం ఉంది. దీంతో ఆమెను హుజురాబాద్ నుంచి బరిలో దింపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఉదయం వరకు జరిగిన ప్రచారం.. ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్, వ్యాపారవేత్త రవికుమార్ పేర్లును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయతే సింగిల్ నేమ్‌తో అధిష్టానానికి అభ్యర్థి పేరును భట్టి, దామోదర్ల కమిటీ పంపించింది. సాయంత్రానికే సీతక్క పేరు రావడం అనూహ్య పరిణామని చెబుతున్నారు.
ఇప్పటికే బీజేపీ ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపింది. ఇక టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపింది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి ఎంపికలనే తర్జనభర్జన పడుతోంది.