కట్టుకున్న భార్య వరకు అక్కర్లేదు.. మనకు నచ్చిన అమ్మాయిని ఎవరైనా తప్పుగా చూస్తున్నా.. తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేసినా.. తాట తీయాలన్నంత కోపం వస్తుంది. అలాంటిది అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను.. ఆమెకు తెలీకుండా ఆమె నగ్న వీడియోల్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన దుర్మార్గుడి ఉదంతం షాకింగ్ గానే కాదు.. విన్నంతనే జీర్ణించుకోలేని పరిస్థితి. ఇలాంటి వాడిని మనిషి అనే కన్నా.. మరే పదమైనా ఉంటుందా? అనిపించక మానదు.
గుంటూరు పట్టణంలోని ఏటీ అగ్రహారానికి చెందిన ఒక భర్త.. తన భార్య నగ్న వీడియోల్ని వీడియోలను ఆన్ లైన్ లో పెట్టటం.. భర్త చేస్తున్న దారుణం గురించి తెలిసిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ తరహ నేరం చేసినట్లు కంప్లైంట్ వచ్చినంతనే షాక్ కు గురైనట్లుగా తెలుస్తోంది. అనంతరం సదరు భర్తకు తమదైన రీతిలో ట్రీట్ మెంట్ ఇచ్చినప్పడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట్లుగా సమాచారం.
నగ్న వీడియోలతోపాటు.. ఆమె స్నానం చేసేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయటం.. నిర్ణీత టైం కేటాయించి.. ఆ సమయంలో ఆమె ఆశ్లీల దృశ్యాలను డబ్బులు తీసుకొని చూపించినట్లుగా తెలిసింది. ఈ విషయాల్ని తెలుసుకున్న పోలీసులు.. సదరు నిందితుడితో పాటు.. అతడికి డబ్బులు ఇచ్చిన నగ్న వీడియోల్ని చూసిన వారి వివరాల్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం పోలీసు శాఖలోని ఐటీ కోర్ విభాగానికి చెందిన అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. డబ్బు కోసం దారుణమైన ఆకృత్యానికి పాల్పడిన భర్త ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.