వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని కి పెద్ద కష్టమే వచ్చేలా ఉంది. వరుసగా ఆయ న ఐదో సారి గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే నామినేషన్ ఆయనకు గుదిబండగా మారింది. కొడాలి నామినేష న్ను తిరస్కరించాలని.. కోరుతూ.. ఆధారాలతో సహా టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి విజయం దక్కించుకున్న కొడాలి నాని.. ఐదో సారి కూడా.. గెలు పు గుర్రం ఎక్కాలనే లక్ష్యంతో ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో పాదయాత్రకూడా చేస్తున్నారు. ఇక, నామినేషన్ల ఘట్టం చివరిరోజైన గురువా రం.. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ నామినేషన్లలోనే నిజాలు దాచి పెట్టి.. ఎన్నికల సంఘానికి తప్పుడు పత్రాలు ఇచ్చారనేది టీడీపీ ఆరోపణ.
స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమి చ్చిన కొడాలి నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలే దని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో టీడీపీ ఫిర్యాదు చేయడంతో ఇది నానికి ఎఫెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
అయితే.. దీనిని రిటర్నింగ్ అధికారి ప్రధానాధికారి మీనాకు సిఫారసు చేయనున్నట్టు తెలిపారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ తిరస్కరణకు గురైతే.. నాని ఇక, రాజకీయాల నుంచి తప్పుకొన్నట్టే అవుతుందని పరిశీలకులు చెబుతు న్నారు. ఇటీవల తమిళనాడులో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను కూడా.. ఇదే కారణంతో తిరస్కరించారు.