ఈ సంక్రాంతికి మంచి అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిన్న సినిమా హనుమాన్ . పెద్ద చిత్రాల మధ్య ధైర్యంగా పోటీకి దిగిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. జనవరి 12న గుంటూరు కాలం లాంటి భారీ సినిమాకు పోటీగా ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకట్లేదు. దానివల్ల ఓపెనింగ్స్ మీద ప్రభావం పడబోతోంది.
అయితే తమ చిత్రంపై పూర్తి ధీమాతో ఉన్న హనుమాన్ టీం.. ఈ నష్టాన్ని కవర్ చేసుకునేందుకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తోంది. హైదరాబాద్ సహా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో జనవరి 11న ఫస్ట్ షోల నుంచి హనుమాన్ బొమ్మ పడబోతుంది. హైదరాబాద్ సిటీలో ఆల్రెడీ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. వాటికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.
ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో హనుమాన్ మూవీ టికెట్స్ శరవేగంగా అమరవుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం సహా పలు థియేటర్లలో షోలు ఓపెన్ చేయగా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఒక షో పెట్టడం, వెంటనే సోల్డ్ ఔట్ అయిపోవడం.. ఇదీ వరస. బుక్ మై షో లో ఆల్రెడీ హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాను మించి ఇంట్రెస్ట్స్ సంపాదించింది.
సంక్రాంతి సినిమాలకు సంబంధించి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్న సినిమా హనుమాన్ ఏ కావడం విశేషం. ప్రస్తుతానికి హనుమాన్ చిత్రానికి జనవరి 12న నాలుగు థియేటర్లు మాత్రమే కేటాయించారు. ముందు రోజు మాత్రం హైదరాబాద్ లాంటి సిటీల్లో మేజర్ స్క్రీన్లలో ఈ సినిమా రెండు షోలు ఆడబోతోంది. కాబట్టి పెయిడ్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమాకు మంచి కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది.