జగన్ సొంత ఇలాకాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జనం నీరాజనం పట్టారు. కమలాపురంలో పర్యటించని చంద్రబాబుకు అక్కడి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు ఇక్కడి జనం నుంచి విశేష స్పందన లభించింది. ఎక్కడికక్కడ జనం భారీగా తరలివచ్చి చంద్రబాబుకు దారి పొడువునా అభివాదం తెలిపారు.
గతం కంటే ఎక్కువగా ప్రజలు వస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నయా జోష్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రాయలసీమలో రాజకీయం మారుతోందని జనం నాడి చెప్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. కడపలో చంద్రబాబుకు జన నీరాజనం జగన్ పతనానికి సంకేతమని అంటున్నారు. టీడీపీ చరిత్రలో ఇంతటి స్పందన ఇంతకుముందు లేదని, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
కడప విమానాశ్రయంలో చంద్రబాబు దిగింది మొదలు…ఆయన పర్యటన ముగిసే వరకు వందలాది వాహనాల్లో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన వెన్నంటే ఉన్నారు. ఓపెన్ టాప్ జీపులో 2 కిలోమీటర్ల దూరం రోడ్ షో చేసిన చంద్రబాబు…నగరంలోకి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటే జనం ఏ రేంజ్ లో వచ్చారో అర్థమవుతోంది. కడపలో రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు చంద్రబాబుకు జేజేలు పలికారు.
భారీ క్రేన్ల సాయంతో గజమాలతో చంద్రబాబును సత్కరించారు. వర్షం మొదలైనప్పటికీ లెక్కచేయకుండా చంద్రబాబు కోసం జనం ఎదురుచూశారు. వర్షం పడకుంటే ఇంకా వేలాది మంది తరలివచ్చేవారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ శ్రేణులు…కడపలో ఆయనను హీరో చేశాయని టాక్ వస్తోంది.
ఎండనకా..వాననకా క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేసారు..సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికల్లో నిలపాలి జాతి గౌరవం????#CBNInKadapa2022 pic.twitter.com/ZlpXE4MDAH
— iTDP Official (@iTDP_Official) May 18, 2022