టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయినపాత్రుడిపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ విషయంలో అధికారులు….జగన్ ఒత్తిడికి తలొగ్గి అయ్యన్నపై కక్షగట్టారని ఆరోపణలు వస్తున్నాయిజ జలవనుల శాఖకు చెందిన 16 సెంట్ల భూమిని అయ్యన్న కబ్జా చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే తనపై నమోదైన భూ ఆక్రమణ కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో అయ్యన్న పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు, ఆయనపై సెక్షన్ 467 ప్రకారం విచారణ జరుపుతామంటూ సిఐడి అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ అధికారులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ కేసులో సెక్షన్ 467 వర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సిఆర్పిసి నిబంధనల ప్రకారం అయ్యన్నకు 41ఏ నోటీసులు జారీ చేయవచ్చని, ఈ వ్యవహారంలో సిఐడి దర్యాప్తు జరుపుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అంతకుముందు, అయ్యన్నపాత్రుడు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. తన క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 467 కింద కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఆ సెక్షన్ చెల్లదని కోర్టుకు వెల్లడించారు. అయితే, అయ్యన్నపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను అయ్యన్న బెదిరించారని, భయపెట్టారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే, ఈ కేసులో సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని స్పష్టం చేసింది.