ఏపీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఒకవైపు హిందు దేవాలయాలపై వచ్చే భక్తులకు ధరల మోత మోగిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం… యథేచ్ఛగా క్రిస్టియానిటీ విస్తరణ జరుగుతుంటే… చట్ట విరుద్ధంగా జరిగే కార్యక్రమాలను కూడా ఆపడానికి పూనుకోవడం లేదు.
మతమార్పిడి అనేది ఏపీలో ఒక ఉద్యమంగా జరుగుతుంటే… బీజేపీ హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూ కళ్లు మూసుకుని కూర్చుంది. అయితే, ఇటీవల తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి… సునీల్ దేవ్ ధర్ లు జగన్ ఏజెంట్లు అని ఒక వార్త ప్రచురించింది.
దీంతో ప్రతి విషయంలో చంద్రబాబు పేరు దూర్చి విమర్శలు చేసే వీరు తాజాగా తాము జగన్ ఏజెంట్లం కాము అని తమపై వచ్చిన ఆరోపణలు చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వీరంతా ఒక గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతామాత పాదముద్రలు, నరసింహస్వామి గుడి ఉన్న కొండపై శిలువను ప్రతిష్టిస్తుంటే సేమ్ ట్వీట్లు వేశారు.
వాస్తవానికి ఈ ట్వీట్లు వేయడం వల్ల మత విషయాలు చర్చకు రావడం ద్వారా అటు బీజేపీ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ క్రిస్టియన్ ఓటు బ్యాంకును జగన్ వైపే బలంగా ఉంచడానికి మరో ప్రయత్నం. అంటే వీరు జగన్ ను వ్యతిరేకిస్తున్నట్టున్నా కూడా పరోక్షంగా వీరి చర్య జగన్ కే మేలు చేస్తుంది. వీరి చర్యలు అన్ని మరి తెలిసో తెలియకనో జగన్ కే మేలు చేస్తాయి.
కింది ట్వీట్లు చూడండి.
కింద ట్వీట్ సునీల్ దేవ్ ధర్ పోస్టు చేయగా… దానిని జీవీఎల్ రీట్వీట్ చేశారు. సరిగ్గా జగన్ మనుషులు అని ప్రచారం జరుగుతున్న ఈ నలుగురే ఈ ట్వీట్ వేయడంలో ఆంతర్యం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.
వాస్తవానికి ఏపీ బీజేపీ నేతలు దీనిని అడ్డుకోవాలి అనుకుంటే ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చేవారు. కోర్టుకు వెళ్లి రెండు మతాల మధ్య భవిష్యత్తులో ఏ గొడవలు రాకుండా ఆ కొండపై కాకుండా వేరే చోట ఈ శిలువ ఏర్పాటు తరలిపోయేలా చేసేవారు. కానీ బీజేపీ ఉద్దేశం హిందు ఆలయ పరిరక్షణ కాదు,
హిందు ఆలయ పరిరక్షణ పేరిట బీజేపీని పెంచుకోవడం, విస్తరించుకోవడమే వారి ఉద్దేశం అని కమ్యూనిస్టు నేతలు ఆరోపించారు.