తాను ఇచ్చిన హామీలు అమలుచేయడంలోను జగన్ ఘోరంగా విఫలం అవుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దుతో సహా చాలా హామీలు పెండింగ్ పెట్టారు.
45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛను రెండేళ్లుగా పెండింగ్ పెట్టారు. వృద్ధులకు ఇచ్చే పింఛను ఏటా 250 పెంచుతాను అని చెప్పి…. రెండేళ్లలో ఒక్కసారే పెంచారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. వృద్ధులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ జులై నుంచి 2500 చేస్తాను అని మాట ఇచ్చాడు. అపుడు అన్ని పేపర్లలో రాయించుకుని, బాగా ప్రచారం వచ్చాక ఇపుడు తాజాగా మాట మార్చారు. జులై 2021 నుంచి కాదు, జనవరి 2022 నుంచి పింఛను పెంపు ఉంటుందన్నారు.
దీంతో మరో 6 నెలలు వృద్ధులు, వికలాంగులకు టోపీ పెట్టినట్టయ్యింది. మద్య నిషేధం చేస్తాను అని చెప్పి దానిని చేయకుండా ఏడాదికి 20 వేల కోట్ల ఆదాయం సంపాదిస్తున్న జగన్ కి ముసలివారికి 250 రూపాయలు ఇవ్వడానికి మనసు రావడం లేదు.
తనకు కావల్సిన వారికి కాంట్రాక్టుల ద్వారా తగిన మేళ్లు చేస్తూ ప్రజల విషయంలో మాత్రం ఎక్కడికక్కడ కోతలు విధిస్తూ ఉన్నారు. పింఛను పెంపు వాయిదా వేయకుండా మొన్న అసెంబ్లీలో ఇచ్చిన మాట మార్చకుండా జులై 8 నుంచే పింఛను పెంచాలని తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.