ఈరోజు ఉదయం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం తెలిసిందే.
ఒక పద్ధతి పాడు లేకుండా నిర్వహించిన కారణంగా, వాటిని రద్దు చేసినట్లు కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి నీలం సాహ్నిపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం తీర్పును తమకు కావాల్సినట్లు ఎస్ఈసీ అన్వయించుకుంది .తీర్పును అవగాహన చేసుకోవటంలో ఎస్ఈసీ విఫలమయ్యారు .సుప్రీం తీర్పును ఇలా అన్వయించుకోవడం ఆమోదయోగ్యం కాదు.4 వారాల సమయం ఇవ్వాలని సుప్రీం తీర్పులో స్పష్టంగా ఉంది.ఆంగ్లభాష తెలిసిన సామాన్యుడికీ సుప్రీం తీర్పు అర్థం అవుతుంది.ప్రస్తుత ఎస్ఈసీ గతంలో సీఎస్ గానూ పనిచేశారు .సుప్రీం తీర్పు సరిగా అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం వేసింది.ఇలాంటప్పుడు ఎస్ఈసీగా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుంది.బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇది హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. అంటే కేవలం పెద్దల మనసు గెలుచుకోవడానికి ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం తగదు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు.