తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సీరియస్ అవుతున్న తీరు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేని వ్యవహారం వంటివి సీఎం కేసీఆర్‌కు పెద్ద తలనొ ప్పిగా పరిణమించాయి.
రెండు రోజులకు ఒకసారి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై విచారణ చేపడుతున్న హైకో ర్టు.. ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన భారీ మొత్తాలని తిరిగి ఇప్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.
దీనిపై తదుపరి విచారణంలో తమకు పూర్తి వివరాలు సమర్పించాలని కూడా ఆదేశించింది. దీంతో ఇప్పు డు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి బాధిత రోగులకు డబ్బులు తిరిగి ఇప్పించడం అనేది కేసీఆర్ సర్కారుకు తలకు మించిన భారమేనని అంటున్నారు పరిశీలకులు.
దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని చెబు తున్నారు. ఒకటి.. సొంత పార్టీకే చెందిన నేతలు.. ఆయా ఆసుపత్రులను నడుపుతుండడం.. రెండోది.. ప్రైవే టు ఆసుపత్రులు దాదాపుగా టీఆర్ ఎస్ కు ఫేవర్‌గా ఉండడం.
ఈ రెండు కారణాలతో ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝళిపించేందుకు కేసీఆర్ సర్కారు ఏమేరకు ముందుకు వస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే.. మరోవైపు.. కన్నెర్ర జేస్తున్న హైకోర్టుతో కేసీఆర్ కు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు.
వాస్తవానికి కరోనా రెండో దశలో ఆస్పత్రులు ఈ 2 నెలల్లో రోగుల నుంచి కనీసం రూ.500 కోట్ల వరకు వసూలు చేశాయని అంచనా. ఆస్పత్రులో రోగుల బిల్లులన్నింటినీ పరిశీలిస్తే దాదాపు రూ.100 కోట్లను తిరిగి ఇప్పించొచ్చని అంటున్నారు పరిశీలకులు.
అయితే.. గత ఏడాది కూడా ఇలానే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి లక్షల్లో రోగులను మింగేసిన ఆసుపత్రుల నుంచి కేవలం రూ.3 కోట్ల మేర ఇప్పించామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టు కు తెలిపారు.
ఈ ఏడాది ఇంత వరకు రూ.కోటి ఇప్పించామని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తూతూ మంత్రమేనని తెలుస్తోంది.
అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స అనుమతి నిలిపివేతకే ప్రాధాన్యమిస్తున్న సర్కారు.. ఇప్పుడు డబ్బులు వెనక్కి ఇప్పించాలన్న హైకోర్టు ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలో అనేక ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ఈ విషయంలో ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం కొంతమేరకు కేసీఆర్‌కు ఊరట కలిగించే అంశం. ఇంతకు మించి.. కేసీఆర్‌కు హైకోర్టు ప్రధాన ప్రతిపక్షంగా ఉందనే వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. మరి ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తిగా మారింది.