ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గ్రేటర్ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్ శాతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. మరో వివాదానికిఎన్నికలసంఘంతెర తీసింది. అర్థరాత్రి వేళ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
గ్రేటర్ఎన్నికల్లో ఓటర్లు తాము ఓటు వేసేటప్పుడు స్వస్తిక్ ముద్రకు బదులుగా కొన్నిచోట్ల.. సదరు పోలింగ్ స్టేషన్ నెంబరును తెలియజేసే ముద్రను ఇచ్చినట్లుగా తమకు సమాచారం అందినట్లుగా పేర్కొంటూ.. అలాంటి ఓట్లను కూడా లెక్కలోకి తీసుకోవాలంటూఎన్నికలసంఘంప్రధానాధికారి పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీతో పాటు ఇతర విపక్షాలుహైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశాయి. దీంతో.. ఈ పిటిషన్లను విచారించినహైకోర్టుకీలక ఆదేశాల్ని జారీ చేసింది. స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ కాకుండా.. మరే గుర్తుగా ఉన్నా ఓటుగా గుర్తించాలని చెబుతూ తెలంగాణఎన్నికలసంఘంఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేసింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రం పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.
అయితే.. స్వస్తిక్ కాకుండా.. వేరే గుర్తుతో ఉన్న పత్రాల్ని వేరుగా లెక్కించాలనిచెప్పింది. తాముజారీ చేసిన ఆదేశాల్ని వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు తెలియజేయాలనిఎన్నికలసంఘాన్ని కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో.. గ్రేటర్ఎన్నికలఅంశం కొత్త వివాదాలకు.. చర్చలకు తెర తీసేలా ఉందని చెప్పక తప్పదు.