టీవీ9 విలేఖరిపై దాడి చేసిన ఘటనలో సీనియర్ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాల రీత్యా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు షాకిచ్చింది.
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
కాగా, మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైంది. మంచు విష్ణుపై మరోసారి పహాడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని, విష్ణుతోపాటు వినయ్ అనే వ్యక్తిపై మనోజ్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదునిచ్చారు.