AP CID అధికారుల తీరుపై HighCourt అసంతృప్తి వ్యక్తం చేసింది.
TDP టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి తనయుడు Vijay విజయ్ ఇంట్లో పిల్లలను విచారణ జరపడంపై మండిపడింది.
నోటీసులు ఇచ్చేందుకు వెళ్లి… వారి పిల్లలను ప్రశ్నించడం ఏంటని సీఐడీ అధికారులను నిలదీసింది.
పదే పదే వారి ఇళ్లకు వెళ్లడం, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని హెచ్చరించింది.
ఈ తరహా వైఖరి అనర్ధాలకు దారి తీస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది.
అంతేకాదు, విజయ్ కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు, కోర్టుకు చెబుతున్న అంశాలకు పొంతనే లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
vijay విజయ్ ఇంటికి పదే పదే వెళ్లడం సరికాదని, వారి కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని సీఐడీ అధికారులను కోర్టు నిలదీసింది.
CID సీఐడీ అధికారులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
చింతకాయల విజయ్ ఇంట్లో కొద్దిరోజుల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయన పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి.
విజయ్ ఎక్కడికి వెళ్లారు అంటూ పిల్లలను సిఐడి అధికారులు పదేపదే ప్రశ్నించి మానసికంగా వేధించారని పలువురు టిడిపి నేతలపాటు అయ్యన్నపాత్రుడు, విజయ్ ఆరోపించారు.
చిన్న పిల్లలను ఆ రకంగా విచారణ చేయడం ఏమిటని వారు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ…ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ సిఐడి అధికారులు తమ పిల్లలను మానసికంగా వేధించారని ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు, భవిష్యత్తులో కూడా సిఐడి పోలీసుల నుంచి తమకు, తమ కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు…రెండు వారాల క్రితం సిఐడి అదనపు డీజీతోపాటు ఏపీ డీజీపీ, సిఐ పెద్దిరాజులకు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…సీఐడీ తీరుపై మండిపడింది.