‘శాకిని ఢాకిని’ చిత్ర ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ రెజీనాను ఓ విలేఖరి అడిగిన ప్రశ్న వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓసీడీ ఉన్న అమ్మాయిగా రెజీనా నటించింది. అయితే నిజజీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా అంటూ రెజీనాను ఆ విలేకరి ప్రశ్నించడంపై దుమారం రేగింది. ఓ హీరోను మీరు ఈ ప్రశ్న అడగగలరా అంటూ రెజీనా ఆ రిపోర్టర్ పై మండిపడింది. అటు సోషల్ మీడియాలోనూ రెజీనాకు మద్దతు లభించింది.
అయితే, తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా చేసిన కామెంట్లు ఆమెను ఇరకాటంలో పడేశాయి. మగాళ్ళను మ్యాగీ నూడుల్స్ తో పోలుస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అబ్బాయిల గురించి తన దగ్గర పెద్ద జోక్ ఉంది అంటూ రెజీనా సదరు యాంకర్ తో చెప్పింది. కానీ, ఆ జోక్ ఇక్కడ వేయకూడదు అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఆ జోక్ అబ్బాయిలపై వద్దు తనపై వేయండి అంటూ యాంకర్ అడిగింది. ‘‘అబ్బాయిలు మ్యాగీ రెండూ రెండు నిమిషాల్లో అయిపోతుంది.. మీకు అర్థం కావడం లేదు’’ అంటూ రెజీనా చెప్పింది. దీంతో, నాకు అర్థమైంది ఇంకొద్దు అంటూ యాంకర్ ఆ టాపిక్ ని కట్ చేసింది. ఈ కామెంట్ల నేపథ్యంలో రెజీనాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయిన రెజీనా మాత్రం ఇలాంటి కామెంట్లు చేస్తోందని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
రెజీనా దగ్గర ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయా అంటూ వారు మండిపడుతున్నారు. అయితే, సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసమే రెజీనా ఈ టైప్ కామెంట్లు చేసిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా, మగాళ్లపై అడల్ట్ జోక్ పేల్చిన రెజీనా మాత్రం నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.