కోలీవుడ్ క్రేజీ హీరో.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు శివ కార్తికేయన్. తమిళనాడులో అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసినంతనే పక్కింటి క్యూట్ బాయ్ లా ఉంటే అతడు నటించిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. ఎలాంటి సందడి లేకుండా రిలీజ్ అయిన ఈ డబ్బింగ్ మూవీ.. వారాంతంలో హౌస్ ఫుల్ అయి.. అప్పట్లోసంచలంగా మారింది. నిర్మాతలు చేసిన తప్పు కారణంగా.. ఈ సినిమాకు రావాల్సినంత ప్రచారం రాలేదు. కానీ.. సినిమా బాగుండటంతో ప్రేక్షకులే ఈ సినిమాకు ప్రచారకర్తలుగా మారటంతో.. ఈ మూవీ చక్కటి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
అయితే.. ఆ సినిమాకు వచ్చిన బజ్.. నలుగురికి తెలిసేసరికి..చాలాచోట్ల థియేటర్ల నుంచి మూవీ వెళ్లిపోయిన పరిస్థితి. తాను చేసే ప్రతి సినిమాను రోటీన్ కు భిన్నంగా ఎంపిక చేసుకునే శివకార్తికేయ.. తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన శివ కార్తికేయ.. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లారు.
స్నేహితులకు కలిసి వెళ్లిన అతడు.. హైదరాబాదీ ఫుడ్ ను బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇదే.. శివకార్తికేయన్ తమిళనాడులోఏ రెస్టారెంట్ కు వెళ్లి.. ఇదే రీతిలో స్నేహితులతోకలిసి భోజనం చేస్తే.. అక్కడ జనాలతో కిక్కిరిసిపోవటం ఖాయం. అంతటి క్రేజ్ ఉన్న అతగాడు.. హైదరాబాద్ లో ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేశారని చెప్పాలి. తనకు చిన్నతనం నుంచి హైదరాబాదీ వంటకాలంటే ఇష్టమని చెబుతూ.. తనకు నచ్చిన ఫుడ్ ను బాగానే లాగించేశాడు. స్నేహితులతో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.