టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కు వివాదరహితుడిగా పేరుంది. తన సిినిమాలేవో తాను తీసుకుంటూ…తన పనేదో తాను చేసుకుంటూ సైలెంట్ గా వెళ్తుంటాడు నితిన్. జయాపజయాలతో పని లేకుండా నితిన్ కు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. మామూలుగా అయితే, ఇండస్ట్రీలో క్యాస్ట్ ట్యాగ్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొందరు హీరోలు ప్రయత్నిస్తుంటారు. కానీ, నితిన్ రెడ్డి అయినప్పటికీ నితిన్ మాత్రం ఆ వ్యవహారాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు.
అటువంటి నితిన్ ఇపుడు తాజాగా ఆ తరహా వ్యవహారంలోకి తనకు తెలియకుండా ఎంటరయినట్లు కనిపిస్తోంది. నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడు ఎం.ఆర్.శేఖర్ వల్ల నితిన్ కాస్త చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఎం.ఆర్.శేఖర్ అలియాస్ ఎం.రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. కుల వైషమ్యాలు రెచ్చగొట్టేలా మరో రెండు సామాజిక వర్గాలను కించపరుస్తూ ఎం.ఆర్.శేఖర్ చేేసిన పోస్ట్ లు ఇపుడు వైరల్ అయ్యాయి.
అత్యంత అసభ్యకరంగా అతడి సామాజిక వర్గం కాని మిగతా రెండు సామాజిక వర్గాలను ఆయన దుమ్మెత్తిపోసిన వైనం ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అప్ కమింగ్ డైెరెక్టర్ రెచ్చిపోయారు. బహుశా ఆ ట్వీట్లు చేసే సమయానికి తనకు ఇండస్ట్రీలో ఈ స్థానం దక్కుతుందని తెలీదు కాబోలు. సరే అదేదో దర్శకుడు కాకముందు చేశాడులే అని సరిపెట్టుకుందామంటే…తన సినిమాలోనూ రా రా రెడ్డి అంటూ ఊపున్న ఐటం సాంగ్ తో తన కులాభిమానాన్ని చాటుకున్నాడు.
దీంతో, శేఖర్ గతంలో ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో, నితిన్ ను శేఖర్ కులరొచ్చులోకి దించినట్లయింది. కానీ, అలి తన ట్వీట్లు కాదని ఎం.ఆర్.శేఖర్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ఆ ట్వీట్లు ఎవరివో…ఇట్టే కనిపెట్టుస్తాన్నారు నెటిజన్లు. అయితే, తన దర్శకుడి వల్ల తన సినిమాకు డ్యామేజీ అయ్యే అవకాశాలు కన్పించడంతో ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత అయిన నితిన్…శేఖర్ ను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఫేక్ ట్వీట్లు నమ్మవద్దని కోరుతున్నానంటూ నితిన్ కవర్ చేసే ప్రయత్నం చేసినా…నెటిజన్లు మాత్రం శేఖర్ ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో, ఆ రెండు సామాజిక వర్గాల వారు, ఆ వర్గాలకు చెందిన నితిన్ అభిమానులు సైతం శేఖర్ ను వెనకేసుకొస్తున్న తమ అభిమాన హీరోను విమర్శిస్తున్నారు. దీంతో, చాలామంది నెటిజన్లు అరెరే..డైరెక్టర్ కుల పిచ్చకు నితిన్ బుక్కయ్యాడే అని అనుకుంటున్నారు. ఈ సినిమా పోతే ఇంకో సినిమా హిట్ అవుతుందని, అటువంటి వివాదాస్పద దర్శకుడికి మద్దతిచ్చేలా నితిన్ ఫేక్ ట్వీట్లు అంటూ అని ఉండాల్సింది కాదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.