ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం విరమించుకోవాలని, ఆ దేశంపై దాడులు ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఐక్యరాజ్యసమితి మొదలు పలు దేశాల అధినేతలు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ తగ్గేదేలే అన్న రీతిలో పుతిన్….ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చదువుకుంటున్న భారతీయ, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల అక్కడ చిక్కుకున్నారు.
యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భద్రతపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని ఏపీలో ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామన్నారు. ఈ రోజు 23 మంది విద్యార్ధులు ఇండియాకు వస్తున్నారని కేంద్రం సమాచారమివ్వగా.. అందులో ఏపీ వాళ్లు ముగ్గురే ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు కృష్ణబాబు. ఢిల్లీకి వచ్చిన వాళ్లను స్వస్థలాలకు పంపేదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఉక్రెయిన్ బోర్డర్ వద్దకు రావద్దని కేంద్రం ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు తాజాగా సూచనలు చేసిందని గుర్తుచేశారు. వీసా స్టాపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా ఉక్రెయిన్ వెళ్లిన సాధారణ తెలుగు వారి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. అంతేకాదు, ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లే టికెట్లు కొనలేని విద్యార్థులకు విమాన టికెట్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులను సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించామన్నారు. మరో, 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ రెండూ దేశాలు మనకు మిత్ర దేశాలేనని చెప్పారు. భారతీయ జెండా కనిపిస్తే దాడి చేయవద్దని రష్యాకు చెప్పామన్నారు.
ఏపీ విద్యార్థులు సంప్రదించాల్సిన నంబర్లు:
నోడల్ అధికారిగా(ఏపీ భవన్) రవి శంకర్- 9871999055
అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ- 7531904820
ఏపీఎన్ఆర్టీ సీఈవో దినేశ్ కుమార్ -9848460046
తెలంగాణ విద్యార్థులు సంప్రదించాల్సిన నెంబర్లు
విక్రమ్సింగ్మాన్: +91 7042566955
చక్రవర్తి పీఆర్వో: +91 9949351270
నితిన్ వోఎస్డీ : +91 9654663661
ఈమెయిల్ ఐడీ : [email protected]
తెలంగాణ సచివాలయం -హైదరాబాద్
చిట్టిబాబు ఏఎస్వో: 040-23220603, +91 9440854433
ఈ-మెయిల్ ఐడీ : e-mail [email protected]