హైదరాబాదును ఉక్కిరిబిక్కిరి చేసిన వర్షాలు తాజాగా బెంగుళూరును చుట్టుముట్టాయి. తీవ్రస్థాయిలో విడవకుండా వర్షాలు కురవడంతో బెంగుళూరు నగరం నీటితో నిండిపోయింది.
డ్రైనేజీలు నిండిపోయి వరద మురికి కలిసి ఇళ్లలోకి ప్రవేశించింది. రోడ్లు నదులయ్యాయి. కాలనీలు చెరువులు అయ్యాయి. మొత్తానికి బెంగుళూరు నగరం అతలాకుతలం అయ్యింది. వర్షం ఆగిన తర్వాత కూడా 30 శాతం బెంగుళూరులో వరద నీరు అలాగే నిలిచి ఉంది.
బెంగుళూరు పరిస్థితిని కళ్లకు కంట్టే కొన్ని దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.