దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ ఘటనలో పోలీసులు చెప్పింది తప్పు అని, దళిత యువతిపై రేప్ జరిగిందని సీబీఐ సంచలన నిజాన్నిబయటపెట్టింది. నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన మాట నిజమే అని నిర్దారించింది.
హథ్రాస్ ఘటన యూపీలోని యోగి ప్రభుత్వంపై పడిన అతిపెద్ద మచ్చ. పోలీసులు, ప్రభుత్వం బాధితురాలిని కాపాడలేకపోగా, బాధితరాలి కుటుంబానికి ఏమాత్రం సహకరించలేదు. దీంతో అన్ని వైరిపక్షాలు ఆందోళన చేశాయి. మీడియా, దేశం మొత్తం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచింది. దీంతో ఆ కేసును సీబీఐకి అప్పగించారు.
పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ నిందితులు ఆమెపై అత్యాచారం చేశారని, ఆమెను రేప్ చేసి చంపేశారని పేర్కొంది. నిందితులను సందీప్, లవకుశ్, రవి, రాము గా తేల్చారు. వారిపై రేప్, హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
నిందితులు దురాగతం ఇదీ..
బాధితురాలుని ఆమె చున్నీతోనే మెడకు బిగించి తోటలోకి లాక్కెళ్లారు దుర్మార్గులు. అనంతరం అక్కడ నలుగురు అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు నీచంగా ఆమెపై పశువుల్లా ప్రవర్తించారు. తర్వాత నాలుక కోసి హింసించారు. అనంతరం గొంతు పిసికారు. అలాంటి ఘోరమైన నొప్పి బాధతో ఆమె నరకయాతన అనుభవిస్తుండగా వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత కొందరు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. 15 రోజుల పాటు నరకం అనుభవించి ఆ యువతి మృతిచెందింది. ఈ ఘటనతో దేశం తీవ్ర మనోవేదన చెందింది.