మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇప్పుడు తెలగాణలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాల్లో ఈ మాజీ మంత్రి. టీఆర్ఎస్ను వీడి అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసి ఉప ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కునేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఉపఎన్నిక కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఈటల టీఆర్ఎస్పైనా సీఎంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
హుజురాబాద్‌లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కౌంటర్ గా మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లు పలు సంఘటనలు సైతం తెరమీదకు వచ్చాయి. ఈ ఎపిసోడ్‌పై తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ప్రజలను తరలించి దావత్, డబ్బులు ఇస్తున్నారని, ఇదే ఆయన పని ఈటల ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే ఇలా మంత్రి హరీష్ రావు చేస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు. హరీష్ రావుకు కూడా తన గతే పడుతుందని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
హుజూరాబాద్ చైతన్యవంతమైనా గడ్డ అని తన ఇలాకా విషయంలో మాజీ మంత్రి ఈటల ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్ అని స్పష్టం చేశారు. బానిసగా బ్రతికినా చరిత్ర, బ్రతికే చరిత్ర మాకు లేదని…డబ్బును, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందన్నారు. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ…బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు.