వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పవన్ పెళ్లిళ్ల గురించి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ కూడా పవన్ ను విమర్శించడానికి వేరే మ్యాటర్ లేక నాలుగు పెళ్లిళ్లు అంటూ అరిగిపోయిన రికార్డు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వైఎస్సార్ కే జగన్ పుట్టారా అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి.
జగన్ కు హరిరామజోగయ్య తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో జగన్ ను ఏకిపారేశారు. వైఎస్సార్ హుందాతనంలో జగన్ కు పదో వంతు లేదని, అసలు వైఎస్ కే జగన్ పుట్టారా అనిపిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ముందు తాను కూడా ద్వేషించానని, ఆ తర్వాత ఆయకు సన్నిహితుడినయ్యానని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ఆర్ తో తనకు సన్నిహిత సంబంధాలుండేవని, విపక్ష నేతలను ఆయన హుందాగా విమర్శించేవారని అన్నారు. పవన్ పై జగన్ విమర్శలు చూస్తుంటే సినిమాలలో విలన్ పాత్రకు జగన్ సరిపోతాడనిపిస్తోందని చురకలంటించారు.
పవన్ నిజాయితీపరుడని, ఆయనపై బురదజల్లేందుకు కారణాలు దొరక్క ఇలా చౌకబారు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోసారి ఇటువంటి చౌకబారు విమర్శలు చేయొద్దని, నోరు అదుపులో పెట్టుకోకుంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు కాదని, 2019 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ కు జగన్ దత్త పుత్రుడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దగ్గర నుంచి కోట్లు తీసుకొని ఆయనకు ఏపీని జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
రాజారెడ్డి మొదలు జగన్ వరకు దోచుకోవడం, దాచుకోవడం వైఎస్ కుటుంబానికి అలవాటేనని, పవన్ పై విమర్శలు మానకుంటే చరిత్ర అంతా బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. ప్రజాభిప్రాయాన్ని లేఖలా రాశానని, ముక్కుసూటిగా చెప్పడం తన నైజం అని, సారీ అని అన్నారు. మరి, హరిరామ జోగయ్య లేఖపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.